ఎన్టీఆర్ జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అదుపుతప్పిన కారు నేరుగా వాగులోకి దూసుకెళ్లింది. ఈ ఘటన పెనుగంచిప్రోలు మండలం కొనకంచి సమీపంలో జరిగింది. ఈ సమయంలో కారులో ఐదుగురు ప్రయాణికులు ఉన్నారు. ఇది చూసిన స్థానిక యువకులు వెంటనే స్పందించి కారులో ఉన్న వారిని రక్షించారు.
ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న చిల్లకల్లు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఎస్సై లు సూర్య శ్రీనివాస్ ,సాయి మణికంఠ సిబ్బందితో ప్రమాదస్థలిని కలిసి పరిశీలించారు. ప్రమాదంలో గాయపడ్డ వారికి సిపీఆర్ చేసి జగ్గయ్యపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాద బాధితులను హైదరాబాదుకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు.


