వెనిజువెలా రాజధాని కారకాస్‌లోని మిరా ఫ్లోరెస్ అధ్యక్ష ప్యాలెస్ సమీపంలో మరొకసారి భారీ కాల్పులు మోత మోగింది. అమెరికా సైన్యం వెనెజువెలా అధ్యక్షుడు మడురోను పట్టుకున్న రెండు రోజుల తర్వాత ఈ ఘటన చోటుచేసుకుంది. భారత కాలమాన ప్రకారం సోమవారం(జనవరి 5వ తేదీ) రాత్రి ఈ ఘటన జరిగింది. ప్యాలెస్‌పై డ్రోన్లు దాడి చేశాయి. వాటిని చూసి వెనెజువెలా భద్రతా దళాలు సైతం కాల్పులు జరిపాయి. ఇందుకు కారణం తెలియపోయినా ఇది అమెరికా దాడి తర్వాత ఏర్పడిన ఉద్రిక్తతల భాగంగా భావిస్తున్నారు.
అమెరికా సైన్యం జనవరి 3న మడురో మరియు ఆయన భార్యను పట్టుకుని న్యూయార్క్‌కు తరలించింది. - : వెనిజువెలా పార్లమెంట్ డెల్సీ రోడ్రిగ్స్‌ను తాత్కాలిక అధ్యక్షురాలిగా ప్రమాణ స్వీకారం చేయించింది. గ అమెరికాతో సహకరించడానికి సిద్ధమని సంకేతాలు ఇచ్చారు రోడ్రిగ్స్ అమెరికాతో సహకరించడానికి సిద్ధమని సంకేతాలు ఇచ్చారు, కానీ మడురోను అమెరికా బంధీగా పేర్కొన్నారు., మడురోపై డ్రగ్ ట్రాఫికింగ్ కేసులు న్యూయార్క్ కోర్టులో కొనసాగుతున్నాయి.


