నికొలస్ మదురోను అమెరికా నిర్బంధించిన తర్వాత వెనెజువెలా ప్రతిపక్ష నాయకురాలు మరియా కొరినా మచాడో తొలిసారిగా స్పందించారు. అమెరికా హామీని నిలబెట్టుకుందన్న మచాడో.. ఆ దేశాధ్యక్షుడు నికొలస్ మదురో, ఆయన భార్యను అమెరికా సైన్యం బందీగా తీసుకెళ్లడంతో వెనెజువెలాకు స్వేచ్ఛ తిరిగి వచ్చిందంటూ ప్రకటించారు.
వెనెజువెలా ప్రజలను ఉద్దేశిస్తూ ఎక్స్ వేదికగా పోస్టు పెట్టిన మచాడో.. వెనెజువెలా ప్రజలు, ఇతర దేశాల పౌరులపై జరిగిన దారుణమైన నేరాలకు నికొలస్ మదురో ఇప్పుడు శిక్ష అనుభవిస్తున్నారన్నారు. ‘‘మదురోపై మాదకద్రవ్యాల అక్రమ రవాణా, నార్కో-టెర్రరిజం ఆరోపణలు ఉన్నాయి. చర్చలతో సమస్య పరిష్కారానికి ఆయన నిరాకరించాడు. దీంతో అమెరికా తన హామీని నిలబెట్టుకుంది’ అని మచాడో ట్వీట్ చేశారు.
ప్రజాస్వామ్యం కోసం కొన్నేళ్లుగా తాను చేసిన పోరాటం ఫలించిందన్న మచాడో.. శాంతియుతంగా, ప్రజస్వామ్యబద్ధంగా అధికార మార్పిడికి ప్రజలు సహకరించాలని ఆమె పిలుపునిచ్చారు. కాగా, వెనెజులా తాత్కాలిక అధ్యక్షురాలిగా ఉపాధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్జ్‌ను వెనెజులా తాత్కాలిక అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టారు. నెజువెలా అధ్యక్షుడు మదురోను బందీగా పట్టుకెళ్లాక ఆ దేశ పరిపాలనా బాధ్యతలను తామే చూసుకుంటామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించిన సంగతి తెలిసిందే.
‘‘అధ్యక్షుడిని ఇప్పటికే బంధించాం. ఇక పరిపాలనా బాధ్యతలను మేమే చూసుకుంటాం. మా కనుసన్నల్లో ఎవరి చేతుల మీదుగా పరిపాలన జరగబోతోందనేది త్వరలోనే ప్రకటిస్తాం. నూతన ప్రభుత్వం ఏర్పడి భద్రంగా, సవ్యంగా, పారదర్శకంగా అధికార బదిలీ జరిగేదాకా పరిపాలన బాధ్యత మాదే. పరిపాలన సవ్యంగా సాగేలా చూసుకుంటాం’’ అని ట్రంప్ అన్నారు. విపక్ష నేత మరియా కొరీనా మచాడోకు పాలనా బాధ్యతలు అప్పగిస్తారా? అని మీడియా ప్రశ్నించగా.. ‘‘ఆమె సారథ్యంలో పాలన కష్టమేమో. ఆమెకు వెనెజువెలా ఇంటా, బయటా పూర్తిస్థాయి మద్దతు లేదు. అయినా ఆమె చాలా మంచి మనిషి’’ అని పేర్కొన్నారు. ‘వెనెజువెలా ఉపాధ్యక్షురాలు డెల్సీ రోడ్రెజ్‌తో మాట్లాడా.. అమెరికా ఏమి అడిగినా ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నానని ఆమె నాతో చెప్పారు’’అని ట్రంప్ వెల్లడించారు.


