సంక్షోభ సమయంలో భారత్‌కు అండగా వెనిజువెలా | Venezuela becomes third largest oil supplier to India | Sakshi
Sakshi News home page

సంక్షోభ సమయంలో భారత్‌కు అండగా వెనిజువెలా

May 23 2026 7:48 PM | Updated on May 23 2026 8:10 PM

Venezuela becomes third largest oil supplier to India

ప్రస్తుతం అంతర్జాతీయంగా చమురు సంక్షోభం నెలకొన్న సంగతి తెలిసిందే. హర్ముజ్ జలసంధి మూసివేయడంతో ప్రపంచవ్యాప్తంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ సంక్షోభ సమయంలో భారత్‌కు  మూడో అతిపెద్ద చమురు సరఫరా దేశంగా వెనిజువెలా అవతరించింది.

ఇంధన పర్యవేక్షణ సంస్థ క్లెప్లర్ డేటా ప్రకారం.. వెనిజువెలా 2026 మే నెలలో  సౌదీ అరేబియా, అమెరికా రెండింటినీ అధిగమిస్తూ మూడో స్థానానికి చేరుకుంది. ప్రస్తుతం, రష్యా, యూఏఈ మాత్రమే వెనిజులా కంటే ఎక్కువ చమురును సరఫరా చేస్తున్నాయి. ఈ నివేదిక  ప్రకారం, ఏప్రిల్‌తో పోలిస్తే ఈ నెలలో భారతదేశానికి వెనిజులా చమురు సరఫరా దాదాపు 50 శాతం పెరిగాయి.

మే నెలలో ఇప్పటివరకు వెనిజువెలా నుండి.. భారత్ రోజుకు సగటున 4,17,000 బ్యారెళ్ల ముడి చమురును కొనుగోలు చేసింది. అంతకుముందు ఈ సంఖ్య రోజుకు 283,000 బ్యారెళ్లుగా ఉంది. జనవరిలో ఆదేశ అధ్యక్షుడు నికోలస్ మదురోను పట్టుకున్న తర్వాత, అమెరికా, వెనిజులా చమురు ఎగుమతులపై కొన్ని ఆంక్షలను సడలించింది. దీంతో కొనుగోళ్లు అధికంగా పెరిగాయి. 

ఈ పెరుగుదలకు రెండు ప్రధానంగా రెండు కారణాలున్నట్లు నివేదికలు తెలుపుతున్నాయి. ఒకటి హర్ముజ్ జలసంధి దిగ్భందనం కాగా మరోకటి.. వెనిజువెలా నుంచి సరఫరా అయ్యే క్రూడాయిల్ చౌకగా ఉండటం. అంతే కాకుండా రిలయన్స్ వంటి భారతీయ రిఫైనరీలు దానిని శుద్ధి చేయగల సామర్థ్యాన్ని అధికంగా కలిగి ఉన్నందున  అవి తమ కొనుగోళ్లు పెరిగినట్లు సమాచారం.

వీటితో పాటు అమెరికా అధ్యక్షుడు తమ వద్ద నుండే చమురు కొనుగోలు చేయాలని భారత్‌పై ఒత్తిడి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రత్యామ్నాయంగా భారత్‌సైతం చమురు కొనుగోళ్లను పెంచింది.

టాఫ్‌ ప్లేసులో రష్యా

ఇరాన్ యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి భారత్‌ రష్యా చమురు కొనుగోలు చేయడం మరింతగా పెంచింది. రష్యా నుండి సరఫరాలు దాదాపు రెట్టింపు అయ్యి రోజుకు 2.3 మిలియన్ బ్యారెళ్లకు చేరుకున్నాయి. ఇరాన్ ,గల్ఫ్ దేశాల నుండి తగ్గిన సరఫరాల స్థానంలో భారతీయ రిఫైనరీలు రష్యా చమురును ఉపయోగించడం ప్రారంభించాయి. 

అయితే ప్రస్తుతం భారత పర్యటనలో ఉన్న అమెరికా విదేశాంగ శాఖ మంత్రి మార్కో రుబియో కీలక ప్రకటన చేశారు. వెనిజువెలా తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్జ్ వచ్చే వారం భారతదేశంలో పర్యటించే అవకాశం ఉందని తెలిపారు. దీంతో ఈ పర్యటనలో చమురు సరఫరాలపై భారత్ కీలక చర్చలు జరిగే అవకాశం ఉంది.

ప్రస్తుత భారత చమురు దిగుమతులు

  • రష్యా- 23 లక్షల బ్యారెళ్లు రోజుకు 

  • యూఏఈ- 4.40 లక్షల బ్యారెళ్లు 

  • వెనిజువెలా- 4.17 లక్షల బ్యారెళ్లు

  • సౌదీ- 3.40 లక్షల బ్యారెళ్లు

  • అమెరికా- 3.10 లక్షల బ్యారెళ్లు

Advertisement
 
Advertisement
Advertisement