భూకంపం ఎప్పుడు వస్తుందో చెప్పలేమా.? వెనెజువెలాలో ఆ కారణంగానే.. | Shocking Facts Behind venezuela Earthquake | Sakshi
Sakshi News home page

భూకంపం ఎప్పుడు వస్తుందో చెప్పలేమా.? వెనెజువెలాలో ఆ కారణంగానే..

Jun 29 2026 12:51 PM | Updated on Jun 29 2026 2:45 PM

Shocking Facts Behind venezuela Earthquake

వెనెజువెలాను అతలాకుతలం చేసిన జంట భూకంపాలు  ప్రపంచాన్ని మరోసారి ఉలిక్కిపడేలా చేశాయి. కొన్ని క్షణాల వ్యవధిలో భూమి కంపిస్తే ఎంతటి ఆధునిక నగరాలైనా పేకముక్కల్లా నేలకొరిగిపోవాల్సిందేనని  ఈ ఘటన మరోసారి గుర్తు చేసింది. అసలు ఈ భూకంపాలను ముందుగా గుర్తించలేమా..?. అలాగే ఈ భూకంపాన్ని తట్టుకునేలా ఇళ్లను స్ట్రాంగ్‌గా ఎలా నిర్మించుకోవాలి. అందుకు అనుగుణంగా ఎలాంటి చర్యలు జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే ఈ భూకంపం కొన్ని చోట్ల సాధరణంగా వస్తే..మరికొన్ని చోట్ల మొత్తం దేశాన్నే తుడిచిపెట్టేస్తోంది.. ఎందుకిలా వంటి పలు సందేహాలను నివృత్తి చేసి, సమగ్ర విశ్లేషణను అందించారు సిఎస్ఐఆర్ సెంట్రల్ బిల్డింగ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్  డైరెక్టర్ రామచెర్ల ప్రదీప్ కుమార్.

అసలు ఈ భూకంపాలకు వాతావరణ మార్పులే కారణమా అంటే?  కాదనే చెబుతున్నారు ప్రదీప్‌ గారు. వందేళ్ల క్రితం ఎన్ని భూకంపాలు వచ్చాయో అన్నే ఇప్పుడు వస్తున్నాయంటున్నారు. నెంబర్‌ మాత్రం మారలేదని చెబుతున్నారు. అయితే ఇంటెన్సిటీ, ఏ డ్యూరేషన్‌లో వస్తాయనేది అనేదాంట్లో తేడాలు ఉంటాయన్నారు. నిజానికి భూకంపం మెకానిజమే వేరు అని చెబుతున్నారు. 

దీన్ని వాతావరణ మార్పులతో లింక్‌ అప్‌ చేయలేమని అభిప్రాయం వ్యక్తం చేశారు. అంతేగాదు భూకంపం ఎప్పుడు వస్తుందన్నది కూడా ముందుగానే చెప్పలేమని అంటున్నారు. ఎందుకంటే మన భూమి తొలుత మండుతున్న అగ్నిగోళంలా ఉండేది. అది నెమ్మదిగా చల్లారి పైనున్న పొర అంత చల్లగా ఘనీభవించిందని అంటున్నారు. లోపల మాత్రం అత్యధిక ఉష్ణోగ్రతలు అలానే ఉన్నాయంటున్నారు. సింపుల్‌గా చెప్పాలంటే భూమి మూడు పొరలతో ఉంటుంది. క్రస్ట్‌, కోర్‌, మాంటిల్‌ అనే పొరలుగా ఉంటుందన్నారు. 

ఇక్కడ క్రస్ట్‌ అంటే పైపొర, మధ్యలోది కోర్‌, ఆ తర్వాత సెంటర్‌లోపల ఉండేది మాంటిల్‌. ఇక్కడ పైనది క్రస్ట్ అంటే క్రస్ట్ థిక్నెస్‌ అంటే..  టోటల్ భూమి రేడియస్. ఇక్కడ పై నుండి మధ్యలో సెంటర్ వరకు చూస్తే గనుక అది ఏకంగా ఆరువేల కిలోమీటలర్లు ఉంటుంది. ఇక్కడ చాలా అధిక ఉష్ణోగ్రతలు ఉంటాయి. ఈ ప్రదేశంలో మరుగుతున్న నీళ్లు మాదిరి ఉంటుందట. ఈ హీట్‌ కారణంగా పైన పొర బ్రేక్‌ అయ్యి 14 మేజర్ ప్లేట్స్‌గా విడిపోయింది. ఇవిగాక కొన్ని మైనర్‌ ప్లేట్స్‌ కూడా ఉన్నాయని చెప్పారు. 

అయితే కన్వెక్టివ్ కరెంట్స్ వల్ల ఈ ప్లేట్‌లు ఒకదానికిఒకటి ఇంటరాక్ట్ అవుతుంటాయి. ఆ ఇంటరాక్షన్‌ కారణంగా భూకంపాలు వస్తాయట. అయితే ఈ ఇంటరాక్షన్‌ జంక్షన్‌లలో వస్తే పెద్ద పెద్ద భూకంపాలు వస్తాయి. ఇప్పుడు వెనిజువెలాలో వచ్చింది అలాంటిదేనని చెబుతున్నారు ప్రదీప్‌గారు. అంతేగాదు ఇక్కడ 400 హిరోషిమా బాంబులు ఒకేసారి రిలీజ్‌ చేస్తే వచ్చే ఎనర్జీ బయటకు వస్తుందట. 

ఇటీవల వెనిజువెలాలో వచ్చింది అంతకు రెట్టింపు అని, అందువల్లే చిగురుటాకిలా వణికిపోయిందని అన్నారు. అలాగే ఈ భూకంపాలను జంతువుల, పక్షులు ముందుగా గుర్తించగలవా అంటే దానిపై మరింతగా లోతుగా విశ్లేషించాల్సి ఉందన్నారు. కానీ ఈ భూకంపాలు ఎంత తీవ్రతతో వచ్చినా..మన ఇళ్ల నిర్మాణాలు అంత సురక్షితంగా నిర్మించుకోగలిగితే..  ఆ విపత్తు సృష్టించే విలయం నుంచి బయటపడొచ్చని అంటున్నారు. 

తమ బృందం ఆ దిశగా ప్రయత్నాలు చేస్తోందన్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూర్‌లో భూకంపం, వరదలు వంటి ఇతర ప్రకృతి వైపరిత్యాలను తట్టుకునే త్రీడీ ఇళ్ల నిర్మాణానికి నాంది పలికామని..త్వరలో ఆ నిర్మాణ ట్రయల్స్‌ పూర్తి చేసి అందరికీ అందుబాటులోకి వచ్చేలా చేయనున్నామని అన్నారు. ఈ ప్రకృతి విలయం గురించి మరిన్ని విషయాలు తెలుసుకోవాలనుకుంటే ఈ కింది వీడియోలో చూడండి. 

వెనిజులా భూకంపం వెనుక దిగ్భ్రాంతికరమైన వాస్తవాలు!


 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement