సాక్షి,విశాఖ: రాష్ట్రంలో పలు చోట్ల భూమి కంపించింది. విశాఖపట్నంలోని పలు ప్రాంతాలలో భూ ప్రకంపనలు చోటు చేసుకున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ఆదివారం తెల్లవారుజామున 5.7 నిమిషాలకు మంగమారిపేట, మధురవాడ, జగదాంబ తదితర ప్రాంతాల్లో భూమి కంపించగా.. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 4.5గా నమోదైంది. విశాఖతో పాటు విజయనగరంలోని పలు ప్రాంతాల్లో భూమికంపిచినట్లు తెలుస్తోంది.


