అత్యంత సమర్థత కలిగిన మిలటరీ యూనిట్‌గా పేరు
వాషింగ్టన్: వెనెజువెలాపై దాడుల్లో అమెరికా డెల్టా ఫోర్స్ కీలక పాత్ర పోషించింది. ఇది అమెరికా సైన్యంలో అత్యున్నత ప్రత్యేక మిషన్ యూనిట్. 1977లో డెలాŠట్ దళాన్ని స్థాపించారు. ఉత్తర కరోలినాలోని ఫోర్ట్ బ్రాగ్ కేంద్రంగా పనిచేస్తోంది. ప్రపంచంలోనే అత్యంత సమర్థత కలిగిన, రహస్య మిలటరీ యూనిట్‌గా డెల్టా ఫోర్స్‌కు పేరుంది.
యూఎస్ ఆర్మీ స్పెషల్ ఆపరేషన్స్ కమాండ్ ఆధ్వర్యంలో కార్యకలాపాలు సాగిస్తోంది. జాయింట్ స్పెషల్ ఆపరేషన్స్ కమాండ్‌కు జవాబుదారీగా ఉంటోంది. అమెరికా సైనికాధికారి కల్నల్ చార్లెస్ బెక్‌విత్ బ్రిటన్‌కు చెందిన 22వ స్పెషల్ ఎయిర్ సరీ్వసెస్ రెజిమెంట్‌ను స్ఫూర్తిగా తీసుకొని డెల్టా దళాన్ని స్థాపించారు. ఈ దళం డెల్టా అని కాకుండా కొన్ని సందర్భాల్లో వేర్వేరు పేర్లతో ఆపరేషన్లు నిర్వహిస్తోంది.
ఉగ్రవాదులపై ఆపరేషన్ల కోసం..
డెల్టా ఫోర్స్‌కు కొన్ని ప్రత్యేక బాధ్యతలు అప్పగించారు. అధిక రిస్‌్కతో కూడిన భారీ ఆపరేషన్లకు ఈ దళాన్ని రంగంలోకి దించుతారు. ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్లు, బందీలను విడిపించడం, ఉగ్రవాద ముప్పును నిర్మూలించడం, ఉగ్రవాదులను ప్రాణాలతో అదుపులోకి తీసుకోవడం వంటివి ప్రధాన బాధ్యతలు. ఉగ్రవాదులపై పోరాటం కోసం సృష్టించిన దళాన్ని వెనెజువెలాలో సైనిక ఆపరేషన్‌కు ఉపయోగించడం గమనార్హం. సంప్రదాయేతర యుద్ధ రీతుల్లోనూ ఈ దళానికి శిక్షణ ఇచ్చారు. ప్రత్యేక సందర్భాల్లో అత్యున్నత పదవుల్లో ఉన్నవారికి రక్షణ కల్పించాల్సి ఉంటుంది. విమానాలు, నౌకలు, రైళ్లు, ఇతర వాహనాల్లో ఆపరేషన్లను విజయవంతంగా పూర్తి చేయడంలో డెల్టా దళానికి గుర్తింపు ఉంది.
అంటే ఎలాంటి పరిస్థితుల్లోనైనా పని చేస్తుంది. డెల్టా ఫోర్స్ చేపట్టిన ఆపరేషన్ల గురించి బయటకు తెలిసింది చాలా తక్కువ. చాలావరకు ఆపరేషన్లు రహస్యంగానే పూర్తయిపోయాయి. 2001లో ఆపరేషన్స్ ప్రైమ్ చాన్స్‌ను ఈ దళం నిర్వహించింది. అంతర్జాతీయ ఉగ్రవాది ఒసామా బిన్ లాడెన్ కోసం వేట సాగించింది. 2019లో ఐసిస్ ఉగ్రవాది అబూ బాకర్ అల్–బగ్దానీని అంతం చేసింది. డెల్టా ఫోర్స్‌లో చేరడం అంత సులభం కాదు. యూఎస్ ఆర్మీ స్పెషల్ ఫోర్సెస్, 75వ రేంజర్ రెజిమెంట్ నుంచి జవాన్లను ఈ దళంలోకి తీసుకుంటారు. అందుకోసం రకరకాల పరీక్షలు నిర్వహిస్తారు. పూర్తి సమర్థత, అంకితభావం ఉన్నవారికే డెల్టా దళంలో ప్రవేశం లభిస్తుంది.


