breaking news
delta force
-
డెల్టా ఫోర్స్దే కీలక పాత్ర
వాషింగ్టన్: వెనెజువెలాపై దాడుల్లో అమెరికా డెల్టా ఫోర్స్ కీలక పాత్ర పోషించింది. ఇది అమెరికా సైన్యంలో అత్యున్నత ప్రత్యేక మిషన్ యూనిట్. 1977లో డెలాŠట్ దళాన్ని స్థాపించారు. ఉత్తర కరోలినాలోని ఫోర్ట్ బ్రాగ్ కేంద్రంగా పనిచేస్తోంది. ప్రపంచంలోనే అత్యంత సమర్థత కలిగిన, రహస్య మిలటరీ యూనిట్‌గా డెల్టా ఫోర్స్‌కు పేరుంది. యూఎస్ ఆర్మీ స్పెషల్ ఆపరేషన్స్ కమాండ్ ఆధ్వర్యంలో కార్యకలాపాలు సాగిస్తోంది. జాయింట్ స్పెషల్ ఆపరేషన్స్ కమాండ్‌కు జవాబుదారీగా ఉంటోంది. అమెరికా సైనికాధికారి కల్నల్ చార్లెస్ బెక్విత్ బ్రిటన్‌కు చెందిన 22వ స్పెషల్ ఎయిర్ సరీ్వసెస్ రెజిమెంట్‌ను స్ఫూర్తిగా తీసుకొని డెల్టా దళాన్ని స్థాపించారు. ఈ దళం డెల్టా అని కాకుండా కొన్ని సందర్భాల్లో వేర్వేరు పేర్లతో ఆపరేషన్లు నిర్వహిస్తోంది. ఉగ్రవాదులపై ఆపరేషన్ల కోసం.. డెల్టా ఫోర్స్‌కు కొన్ని ప్రత్యేక బాధ్యతలు అప్పగించారు. అధిక రిస్‌్కతో కూడిన భారీ ఆపరేషన్లకు ఈ దళాన్ని రంగంలోకి దించుతారు. ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్లు, బందీలను విడిపించడం, ఉగ్రవాద ముప్పును నిర్మూలించడం, ఉగ్రవాదులను ప్రాణాలతో అదుపులోకి తీసుకోవడం వంటివి ప్రధాన బాధ్యతలు. ఉగ్రవాదులపై పోరాటం కోసం సృష్టించిన దళాన్ని వెనెజువెలాలో సైనిక ఆపరేషన్‌కు ఉపయోగించడం గమనార్హం. సంప్రదాయేతర యుద్ధ రీతుల్లోనూ ఈ దళానికి శిక్షణ ఇచ్చారు. ప్రత్యేక సందర్భాల్లో అత్యున్నత పదవుల్లో ఉన్నవారికి రక్షణ కల్పించాల్సి ఉంటుంది. విమానాలు, నౌకలు, రైళ్లు, ఇతర వాహనాల్లో ఆపరేషన్లను విజయవంతంగా పూర్తి చేయడంలో డెల్టా దళానికి గుర్తింపు ఉంది. అంటే ఎలాంటి పరిస్థితుల్లోనైనా పని చేస్తుంది. డెల్టా ఫోర్స్ చేపట్టిన ఆపరేషన్ల గురించి బయటకు తెలిసింది చాలా తక్కువ. చాలావరకు ఆపరేషన్లు రహస్యంగానే పూర్తయిపోయాయి. 2001లో ఆపరేషన్స్ ప్రైమ్ చాన్స్‌ను ఈ దళం నిర్వహించింది. అంతర్జాతీయ ఉగ్రవాది ఒసామా బిన్ లాడెన్ కోసం వేట సాగించింది. 2019లో ఐసిస్ ఉగ్రవాది అబూ బాకర్ అల్–బగ్దానీని అంతం చేసింది. డెల్టా ఫోర్స్‌లో చేరడం అంత సులభం కాదు. యూఎస్ ఆర్మీ స్పెషల్ ఫోర్సెస్, 75వ రేంజర్ రెజిమెంట్ నుంచి జవాన్లను ఈ దళంలోకి తీసుకుంటారు. అందుకోసం రకరకాల పరీక్షలు నిర్వహిస్తారు. పూర్తి సమర్థత, అంకితభావం ఉన్నవారికే డెల్టా దళంలో ప్రవేశం లభిస్తుంది. -
టెర్రరిస్టులపై పోరుకు డెల్టా ఫోర్స్
గుట్టుచప్పుడు కాకుండా ప్రత్యేక ఆపరేషన్లు నిర్వహించడంలో ప్రసిద్ధి చెందిన అమెరికా సైన్యంలోని 'డెల్టా ఫోర్స్' ఇరాక్‌లోని ఐఎస్ఐఎస్ టెర్రరిస్టులను తుద ముట్టించేందుకు రంగంలోకి దిగిందని అమెరికా సైనికవర్గాల ద్వారా తెలిసింది. డెల్టాఫోర్స్కు చెందిన దాదాపు 200 మంది సైనికులు ఇరాక్‌లో మకాం వేసి టెర్రరిస్టుల నాయకుల గురించి, వారి స్థావరాల గురించి సమాచారాన్ని సేకరిస్తున్నారు. ఇంతకాలం డ్రోన్ల ద్వారా ఐఎస్ఐఎస్ టెర్రరిస్టులపై దాడులు జరిపిన డెల్టా ఫోర్స్ ఇప్పుడు టెర్రరిస్టులతో భూతల యుద్ధానికి సన్నద్ధమవుతోంది. గతంలో అఫ్ఘానిస్తాన్, ఇరాక్లలో ప్రత్యేక ఆపరేషన్లు నిర్వహించిన అనుభవం ఉన్న ఈ ఫోర్స్ ఇప్పటికే ఆరు టెర్రరిస్టు స్థావరాలను గుర్తించినట్లు తెలిసింది. టెర్రరిస్టులను వీలైతే సజీవంగా పట్టుకోవడం, లేదంటే హతమార్చడం, వారి చెరలో ఉన్న బందీలను విడిపించడం ఇప్పుడు ప్రధాన లక్ష్యం. సామాన్య పౌరులకు ప్రాణ నష్టం జరగుకుండా అతి జాగ్రత్తగా ఆపరేషన్లను నిర్వహించడంలో డెల్టాఫోర్స్ దిట్ట. ఉన్నతాధికారుల ఆదేశాల కోసం ఎదురుచూడకుండా సమయానుకూలంగా ఆపరేషన్లు నిర్వహించే స్వేచ్ఛ ఈ ఫోర్స్‌కు ఉంది. కొన్ని సందర్భాల్లో మాత్రమే అమెరికా అధ్యక్షుడిని అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. ఐఎస్ఐఎస్ టెర్రరిస్టులను తుద ముట్టించేందుకు ప్రత్యేక దళాలను ఇరాక్‌కు పంపిస్తున్నామని, అమెరికా రక్షణ మంత్రి ఆష్ కార్టర్ గత డిసెంబర్లోనే ప్రకటించడం 'డెల్టా ఫోర్స్' ఇరాక్‌లో మకాం వేసిందన్న విషయాన్ని రుజువు చేస్తోంది. ప్రత్యేక దళం దాడులతో ఐఎస్ఐఎస్ టెర్రరిస్టులు ఎక్కడున్నా భయంతో చావాల్సిందేనని కూడా ఆయన వ్యాఖ్యానించారు. 2015, మే నెలలో సిరియాలోని ఓ ఐఎస్ఐఎస్ స్థావరాన్ని లక్ష్యాంగా చేసుకొని డెల్టా ఫోర్స్ జరిపిన దాడిలో వాంటెడ్ టెర్రరిస్టు అబు సయ్యద్ మరణించగా, ఆయన భార్య పట్టుబడింది. ప్రస్తుతం సిరియాలో దాడులు జరిపే ఉద్దేశం డెల్టాఫోర్స్కు లేదు. స్థానికంగా సహాయం చేసే స్థితిలో ప్రభుత్వ దళాలు లేవు. ఇరాక్‌లో ప్రభుత్వ సైనికులు, టెర్రరిస్టు వ్యతిరేక దళాలు డెల్టా ఫోర్స్‌కు సహకరిస్తున్నాయి. ఇరాక్‌లో దాడుల ఏర్పాట్లలో ఉన్న ఈ ఫోర్స్ ఎప్పుడు దాడులు ప్రారంభించేదీ ఇంకా తెలియదు.


