
కారాకస్: వెనెజులాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఓ విమానం టేకాఫ్(Venezuela plane crash) అవుతూ కుప్పకూలిపోయింది. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు నెట్టింట వైరల్‌గా మారాయి.
వివరాల ప్రకారం.. వెనెజులాలోని టాచిరాలోని పరమిల్లో ఎయిర్‌పోర్ట్‌లో విమానం టేకాఫ్ అయ్యింది. విమానం రన్‌వే నుంచి ఎగరగానే ఒక్కసారిగా గింగిరాలు తిరుగుతూ కిందపడిపోయింది. అనంతరం పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదానికి సంబంధించిన షాకింగ్ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. దీనిపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
Ongoing: a PA-31 crashed in San Cristóbal (Venezuela), all 2 aboard died. Aircraft registration was YV1443 (Via pro_plane_pilot) pic.twitter.com/7Vjul7DDgw
— Air Safety #OTD by Francisco Cunha (@OnDisasters) October 22, 2025