వాషింగ్టన్: ‘.. ప్లేసు నువ్వు చెప్పినా సరే, టైమ్ నువ్వు చెప్పినా సరే, ఎప్పుడైనా సరే, ఎక్కడైనా సరే… దమ్ముంటే నన్ను పట్టుకో’అంటూ సినిమా స్టైల్లో సవాలు విసిరిన వెనెజువెలా అధ్యక్షుడు నికొలస్ మదురోపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సైనిక చర్యకు ఆదేశాలు జారీ చేశారు. తమ నివాసంలో నిద్రిస్తున్న మదురోను, ఆయన సతీమణి సిలియా ఫ్లోరెస్‌ను అమెరికా సైన్యం ఎత్తుకొచ్చింది. ఆ తర్వాత ప్రెస్‌మీట్ పెట్టి మరి మదరు ఛాలెంజ్‌ను గుర్తు చేసింది.
వెనెజువెలా అప్పటికే తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో ఉంది. అవినీతి, కరువు, చమురు అమ్మకాలపై ఆధారపడే ఆర్థిక వ్యవస్థ ప్రజలను తీవ్ర ఇబ్బందుల్లోకి నెట్టింది. ఈ పరిస్థితుల్లో అమెరికా ఆంక్షలు విధించడం దేశాన్ని మరింత కుదేలు చేసింది. గగనతలాన్ని మూసివేస్తున్నట్లు ట్రంప్ ప్రకటించడం, అంతర్జాతీయ వాణిజ్యాన్ని అడ్డుకోవడం వెనెజువెలా ప్రజలకు మరింత భారంగా మారింది.
రివార్డు ప్రకటన, సవాలు
ఆ తర్వాత మదురోను పట్టుకునేందుకు వీలుగా సమాచారం అందిస్తే భారత కరెన్సీలో రూ.400 కోట్లు రివార్డు ఇస్తామని అమెరికా ప్రకటించింది. ఈ ప్రకటనతో మదురో మరింత రెచ్చిపోయారు. డొనాల్డ్ ట్రంప్‌కు బహిరంగంగా సవాలు విసిరారు. ‘పిరికోడా.. నేనిక్కడే మిరాఫ్లోర్స్ (వెనెజువెలా) అధ్యక్ష భవనంలో ఉంటా. ఆలస్యం చేయొద్దు, వచ్చి పట్టుకోండి’అంటూ చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయంగా చర్చనీయాంశమయ్యాయి.
Nicolas Maduro had his chance — until he didn’t.
The Trump Admin will always defend American citizens against all threats, foreign and domestic. 🇺🇸🦅 pic.twitter.com/eov3GbBXf4— The White House (@WhiteHouse) January 4, 2026
ఆపరేషన్ అబ్సల్యూట్ రిసాల్వ్
మదురోను పట్టుకునేందుకు అమెరికా ‘ఆపరేషన్ అబ్సల్యూట్ రిసాల్వ్’ పేరుతో సైనిక చర్యకు దిగింది. శనివారం తెల్లవారు జామున (స్థానిక సమయం) వెనెజువెలా రాజధాని కరాకస్ నడిబొడ్డున అత్యంత కట్టుదిట్టమైన భద్రతతో, మందమైన స్టీల్‌డోర్లు, కిటికీలతో కూడిన కోటలాంటి ప్యాలెస్‌లో ఉన్నారు. తనను ఎవరూ ఏమీ చేయలేరని అనుకున్నారు. కానీ మా స్పెషల్ ఫోర్సెస్ పెద్ద ఎత్తున విమానాలు,ఫైటర్ జెట్లు హెలికాప్టర్లతో దాడులు చేశాయి. మెరుపు వేగంతో టియునా మిలిటరీ కాంపౌండ్ ప్యాలెస్‌లో పడక గదిలో నిద్రిస్తుండగా మదురో దంపతులను ఎత్తుకొచ్చాయి.
చివరికి అమెరికా సైన్యం మదురోను, ఆయన భార్య సిలియా ఫ్లోరెస్‌ను అదుపులోకి తీసుకుంది. ఈ సంఘటనను ట్రంప్ ప్రెస్‌మీట్‌లో ప్రకటించారు. మదురో చేసిన వ్యాఖ్యల వీడియోలను ప్రదర్శించి..‘సవాలు చేసిన వారిని మేం పట్టుకున్నాం’ అంటూ జాయింట్ చీఫ్స్ చైర్మన్ జనరల్ డాన్ కెయిన్ పరోక్షంగా వ్యాఖ్యానించారు. ఆ వీడియోలు సోషల్ మీడియాలో మళ్లీ వైరల్ అయ్యాయి.
భార్యపై కేసులు
వారిపై నార్కో-టెర్రరిజం యునైటెడ్ స్టేట్స్‌లోకి టన్నుల కొద్దీ కొకైన్ దిగుమతి, అక్రమ ఆయుధాలు కలిగి ఉండటం వంటి అభియోగాలు మోపబడ్డాయి. ప్రస్తుతం మదురో దంపతులు బ్రూక్లిన్‌లోని మెట్రోపాలిటన్ డిటెన్షన్ సెంటర్‌లో ఉంచారు. వారిని విచారిస్తున్నారు. మదురో చేసిన హాస్య వ్యాఖ్యలు ఇప్పుడు ఆయనకే బూమరాంగ్ అయ్యాయి.‘నన్ను పట్టుకోగలిగితే పట్టుకో’ అన్న సవాలు చివరికి ఆయనను అమెరికా జైలులోకి నెట్టిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
Operation Absolute Resolve. pic.twitter.com/KOtW0C0V1O
— The White House (@WhiteHouse) January 3, 2026


