వెనిజులా ప్ర‌భుత్వం సంచ‌ల‌న నిర్ణ‌యం | More than 50 people granted alternative detention measures in Venezuela | Sakshi
Sakshi News home page

వెనిజులా ప్ర‌భుత్వం సంచ‌ల‌న నిర్ణ‌యం

Apr 21 2026 5:05 AM | Updated on Apr 21 2026 5:12 AM

More than 50 people granted alternative detention measures in Venezuela

దేశంలో శాంతిని ప్రోత్స‌హించే ప్ర‌య‌త్నాల్లో భాగంగా వెనిజులా ప్ర‌భుత్వం సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. త‌మ‌కు వ‌చ్చిన అభ్యర్థనల‌ మేరకు, 51 మందికి జైలుకు బదులు ప్రత్యామ్నాయ నిర్బంధ చర్యలను మంజూరు చేసినట్లు వెనిజులా ప్రభుత్వం తెలిపింది. 

ప్రతిపక్షాలు, మానవ హక్కుల సంఘాలు మాత్రం చాలా సంవత్సరాలుగా ప్రభుత్వం అసమ్మతిని అణచివేయడానికి నిర్బంధాలను ఉపయోగిస్తోందని ఆరోపిస్తున్నాయి. అయితే ప్రభుత్వం ఆ వ్యక్తుల పేర్లను గానీ, వారు ఏ కేసులకు సంబంధించినవారు అనే వివ‌రాల‌ను వెల్ల‌డించ‌లేదు. 

ఇక ప్రభుత్వ రంగ చమురు సంస్థ పీడీవీఎస్ఏలో జరిగిన అవినీతి ఆరోపణల కేసుల్లో అరెస్టయిన డజన్ల కొద్దీ వ్యక్తుల న్యాయవాదులు, బంధువులు మాట్లాడారు. వారిలో చాలామంది కుటుంబాలు నిర్దోషులని చెబుతుండగా, తమ క్లయింట్లలో కొందరు విడుదలయ్యారని తెలిపారు. అరెస్టయిన వారికి ప్రాతినిధ్యం వహిస్తున్న బృందం, వారిలో చాలామందిపై ఇంకా న్యాయపరమైన ప్రక్రియలు పెండింగ్‌లో ఉన్నాయని ప్ర‌భుత్వం పేర్కొంది.

తాత్కాలిక అధ్య‌క్షురాలు డెల్సీ రోడ్రిగ్జ్ అధికారం చేపట్టిన త‌ర్వాత శాస‌న‌స‌భ ఆమోదించిన ప‌రిమిత క్ష‌మాభిక్ష చ‌ట్టం ఆధ్వ‌ర్యంలో గ‌త జ‌న‌వ‌రి నుంచి వంద‌లాది మంది విడుద‌ల‌కు సంబంధించి చ‌ర్య‌ల‌ను ద‌గ్గ‌రుండి ప‌ర్య‌వేక్షించారు. ఇక జ‌న‌వ‌రిలో మాజీ అధ్య‌క్షుడు నికోల‌స్ మ‌దురోను అమెరికా నిర్భందించిన త‌ర్వాత ఆ దేశంతో స‌త్సంబంధాల‌ను కొన‌సాగించేందుకు కీల‌క‌మైన ఒప్పందాల ప్యాకేజీలో ఈ ప్ర‌య‌త్నం ఒక భాగ‌మ‌ని చెప్పొచ్చు. 

అయితే 485 మంది రాజ‌కీయ ఖైదీలు ఇంకా జైల్లోనే మ‌గ్గుతున్నార‌ని న్యాయ హ‌క్కుల బృందం ఫోరో ఫపెనాల్ తెలిపింది. కాగా క్ష‌మాబిక్ష అమ‌ల్లోకి వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి వేలాది మందిని విడుద‌ల చేశార‌ని లేదా వారిపై ఉన్న ఇత‌ర చ‌ట్ట‌ప‌ర‌మైన ఆంక్ష‌ల‌ను తొల‌గించాల‌ని ప్ర‌భుత్వం పేర్కొంది.

Advertisement
 
Advertisement
Advertisement