వెనిజులాలో భారీ భూకంపం.. భయంతో జనం పరుగులు | Earthquake With Magnitude Of 6.2 Shakes West Venezuela Videos Goes Viral | Sakshi
Sakshi News home page

వెనిజులాలో భారీ భూకంపం.. భయంతో జనం పరుగులు

Sep 25 2025 8:54 AM | Updated on Sep 25 2025 10:35 AM

Earthquake shakes west Venezuela Videos Viral

కారాకస్‌: దక్షిణ అమెరికాలోని వెనిజులాలో(venezuela) భారీ భూకంపం సంభవించింది. భూకంపం(Earthquake) తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.2గా నమోదు అయినట్టు నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ (ఎన్సీఎస్) తెలిపింది. భూకంప తీవ్రత కారణంగా ప్రజలందరూ భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఈ భూకంపం కారణంగా ప్రాణ, ఆస్తి నష్టం వివరాలు తెలియాల్సి ఉంది.

వివరాల ప్రకారం.. గురువారం తెల్లవారుజామున రిక్టర్ స్కేలుపై 6.2 తీవ్రతతో వెనిజులాలో భూకంపం సంభవించింది. జులియా రాష్ట్రంలోని మెనే‌గ్రాండే ప్రాంతానికి తూర్పు-ఈశాన్య దిశలో 24 కిలోమీటర్ల (15 మైళ్లు) దూరంలో, రాజధాని కారకాస్ కు పశ్చిమాన 370మైళ్లు (600 కిలోమీటర్లు)కంటే ఎక్కువ దూరంలో భూకంప కేంద్రం ఉందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ (ఎన్సీఎస్) తెలిపింది. భూకంపం ఐదు మైళ్లు (7.8కిలో మీటర్లు) లోతులో ఉందని ఏజెన్సీ నివేదించింది. మెనే ‌గ్రాండే దేశ చమురు పరిశ్రమకు ముఖ్యమైన ప్రాంతమైన మారకైబో సరస్సుకు తూర్పున భూకంప కేంద్రం ఉంది.

కాగా, భూకంపం ప్రభావంతో పలు ప్రాంతాల్లోని ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. అయితే, ఆస్తి, ప్రాణ నష్టంపై ఇంకా స్పష్టత రాలేదు. మరోవైపు.. వెనిజులా‌లోని అనేక రాష్ట్రాలతోపాటు పొరుగున ఉన్న కొలంబియా, కరీబియన్ నెదర్లాండ్స్, కరసౌ, అరుబాలతోపాటు మొత్తం ఆరు దేశాల్లో భూ ప్రకంపనలు సంభవించాయి. ముఖ్యంగా వెనిజులా, కొలంబియాలో భూకంప తీవ్రత ఎక్కువగా కనిపించింది. దీనికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. 

Advertisement
 
Advertisement
Advertisement