యుద్ధం ఎఫెక్ట్‌.. వేలసంఖ్యలో మృతులు.. లక్షలాది నిరాశ్రయులు | lebanon children homeless iran israel war | Sakshi
Sakshi News home page

యుద్ధం ఎఫెక్ట్‌.. వేలసంఖ్యలో మృతులు.. లక్షలాది నిరాశ్రయులు

Mar 17 2026 4:03 AM | Updated on Mar 17 2026 4:03 AM

 lebanon children homeless iran israel war

పశ్చిమాసియా యుద్ధం తీవ్ర మానవతా సంక్షోభానినికి దారి తీస్తుంది. ఈ యుద్దంలో ఇప్పటికే దాదాపు 2 వేల మందికి పైగా పౌరులు చనిపోగా లక్షల సంఖ్యలో ప్రజలు నిరాశ్రయులయ్యారు. అంతే కాకుండా పెద్ద మెుత్తంగా ఆస్తినష్టం సంభవించింది.

ఇరాన్‌పై ఇజ్రాయెల్ అమెరికా దాడులు మెుదలు పెట్టి 15 రోజులు పూర్తయింది. అయినప్పటికీ యుద్ద ఉద్రిక్తతలు చల్లారడం లేదు. దాడులు ప్రతిదాడులతో పశ్చిమాసియా రగిలిపోతుంది.కాగా ఇప్పటివరకూ యుద్దం కారణంగా నష్టపోయిన వారి తీవ్ర స్థాయిలో ప్రాణ, ఆస్తి నష్టం సంభవించగా లక్షల సంఖ్యలో ప్రజలు నిరాశ్రయులైనట్లు తెలుస్తోంది.

యుద్దం ప్రారంభంనుంచే ఇజ్రాయెల్ ఏకకాలంలో ఇరాన్‌తో పాటు లెబనాన్‌పై దాడి చేస్తోంది. అక్కడి హిజ్బుల్లా తీవ్రవాదులే టార్గెట్‌గా దాడులు జరుపుతున్నట్లు చెప్పినప్పటికీ చాలా మట్టుకు జనావాసాలపైనే ఇజ్రాయెల్‌ మిసైల్స్ పడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఓ నివేదిక తీవ్ర కలవరపాటుకు గురిచేస్తుంది. యుద్దం కారణంగా లెబనాన్‌లో ఇప్పటి వరకూ దాదాపు ఎనిమిది లక్షల ప్రజలు నిరాశ్రయులైనట్లు నివేదికలు తెలిపాయి. అంతే కాకుండా వారిలో దాదాపు రెండు లక్షల మంది చిన్నారులున్నట్లు పేర్కొన్నాయి.

దీనితో పాటు యుద్దం ప్రభావం గల్ఫ్ దేశాలపైనా అధికంగా పడింది. అక్కడి అమెరికా రక్షణ స్థావరాలే టార్గెట్‌గా ఇరాన్ దాడులు జరపడంతో ఆ దేశాలలోని పర్యాటక రంగం పూర్తిగా దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. ఎల్లప్పుడూ రద్దీగా ఉండే దుబాయి బీచ్‌లు, హోటళ్లు పర్యాటకులు లేక వెలవెలబోతున్నాయి. మార్కెట్లు సైతం నిర్మానుష్యంగా మారాయి. దీంతో యుద్దం ఎప్పుడు ముగుస్తుందా అని ఆందోళన చెందుతున్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement