ఇజ్రాయెల్‌ దాడుల్లో 12 మంది మృతి | 12 people Death in Lebanon in Israeli strike | Sakshi
Sakshi News home page

ఇజ్రాయెల్‌ దాడుల్లో 12 మంది మృతి

May 27 2026 1:30 AM | Updated on May 27 2026 1:30 AM

12 people Death in Lebanon in Israeli strike

బీరూట్‌: ఇజ్రాయెల్‌ సైన్యం మంగళవారం లెబనాన్‌లోని దక్షిణ, బెకా లోయ తూర్పు ప్రాంతాల్లో భీకర దాడులకు దిగింది. హెజ్‌బొల్లాకు చెందిన కమాండ్‌ సెంటర్లు, ఆయుధ డిపోలు, అబ్జర్వేషన్‌ పాయింట్లే లక్ష్యంగా 100కు పైగా ప్రాంతాలపై దాడులు జరిపినట్లు తెలిపింది. మషఘారా గ్రామంపై జరిగిన ఒక దాడిలో కుటుంబంలోని ఏడుగురు సహా 12 మంది చనిపోయారని అధికార వార్తా సంస్థ పేర్కొంది.

నబాటియే ప్రావిన్స్, నగరాన్ని వెంటనే ఖాళీ చేయాలంటూ ఇజ్రాయెల్‌ ఆర్మీ మంగళవారం అక్కడి ప్రజలకు తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. ఇలా ఉండగా, వ్యూహాత్మకంగా కీలకమైన లిటానీ నదిని దాటి ముందుకు వచ్చేందుకు ఇజ్రాయెల్‌ ఆర్మీ చేసిన ప్రయత్నాలను తిప్పికొట్టినట్లు ఇరాన్‌ దన్ను కలిగిన హెజ్‌బొల్లా మిలిటెంట్‌ గ్రూప్‌ తెలిపింది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement