
లెబనాన్‌లోని హిజ్బుల్లా ఉగ్రవాద స్థావరాలే లక్ష్యంగా వైమానిక దాడులతో ఇజ్రాయెల్ విరుచుకుపడింది. ఈ దాడుల్లో నబాతియే (Nabatieh) ప్రాంతంలోని కీలక ఉగ్రవాద స్థావరాలు ధ్వంసమయ్యాయి.
ఈ దాడులపై ఐడీఎఫ్ ప్రతినిధి స్పందిస్తూ.. ఉత్తర కమాండ్ నేతత్వంలో ఐడీఎఫ్.. లెబనాన్‌లోని నబతియే ప్రాంతంలో హిజ్బుల్లా ఉగ్రవాద స్థావరాలపై వైమానిక దాడులు నిర్వహించిందని తెలిపారు. హిజ్బుల్లా ఉగ్రవాద సంస్థ లెబనాన్ అంతటా ఉగ్రవాద స్థావరాలను పునర్నిర్మించడానికి ప్రయత్నాలను కొనసాగిస్తోందని.. హిజ్బుల్లా కార్యకలాపాలు.. ఇజ్రాయెల్, లెబనాన్ మధ్య కుదిరిన అవగాహన ఒప్పందాన్ని ఉల్లంఘిస్తున్నాయని ఐడీఎఫ్ పేర్కొంది.