ఐదేళ్లలో 5,800 మందిని తీసుకెళ్లాలని ప్రణాళిక
2026లో 1,200 మంది వలసకు అవకాశం
జెరూసలేం: ఈశాన్య భారతంలో ఉన్న 5,800 మంది యూదులను రాబోయే ఐదేళ్లలో ఇజ్రాయెల్‌కు తీసుకెళ్లే ప్రతిపాదనకు ఆ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ ప్రాంతంలో ఉన్న బ్నీ మెనాషే కమ్యూనిటీ వలసలకు ఇజ్రాయెల్ ప్రభుత్వం ఆమోదం తెలిపిందని యూదు ఏజెన్సీ తెలిపింది. ‘2030 నాటికి 5,800 మంది కమ్యూనిటీ సభ్యులను ఇజ్రాయెల్‌కు తీసుకొస్తుంది. 2026లో 1,200 మంది ఇజ్రాయెల్‌కు రానున్నారు’అని వెల్లడించింది.
ప్రీ ఇమ్మిగ్రేషన్ ప్రక్రియకు ఒక యూదు ఏజెన్సీ నాయకత్వం వహించడం ఇది మొదటిసారి. వీరు ఇజ్రాయెల్ చీఫ్ రబ్బినేట్, కన్వర్షన్ అథారిటీ, పాపులేషన్–ఇమిగ్రేషన్ అథారిటీతో కలిసి అర్హత ఇంటర్వ్యూలు నిర్వహించడం, అర్హత ఉన్న వారిని తీసుకెళ్లడానికి విమానాలను నిర్వహించడం, ఇజ్రాయెల్‌లో వారు కొత్త జీవితాన్ని ప్రారంభించడానికి అన్ని ఏర్పాట్లు చేయడం ఈ ఏజెన్సీనే చేస్తుంది.
వలసదారుల విమాన ఖర్చులు, వారి మత మారి్పడి, గృహ నిర్మాణం, హిబ్రూ పాఠాలు చెప్పడంతోపాటు ఇతర ప్రయోజనాలను కల్పించడానికి 90 మిలియన్ షెకెల్స్ బడ్జెట్‌ను అంచనా వేసింది. దీనిని ఇమ్మిగ్రేసన్, ఇంటిగ్రేషన్ మంత్రి ఓఫిర్ సోఫర్‌మంత్రి వర్గానికి సమర్పించారు. ఈ ప్రక్రియ నిర్వహణ కోసం రబ్బీల ప్రతినిధి బృందం రాబోయే రోజుల్లో ఇండియాకు రానుంది.
ఇలా వసల వెళ్లినవారికి ప్రారంభంలో వెస్ట్‌బ్యాంక్‌లో పునరావాసం కల్పించారు. ఇటీవల వారిని ఇజ్రాయెల్‌లోని నజరేత్‌కు చాలా దగ్గరగా ఉన్న అరబ్ నగరం నోఫ్ హగలిల్ పట్టణానికి పంపారు. రాబోయే ఐదేళ్లలో షెడ్యూల్ చేసిన వారిని కూడా అక్కడే స్థిరపడేలా చేయాలని కేబినెట్ నిర్ణయించింది. గతంలో బ్నీ మెనాషే యూదుల గురించి అనేక చర్చలు జరిగాయి.
బ్నీ మెనాషే అనేది మణిపూర్, మిజోరాంలలో ఉన్న యూదు కమ్యూనిటీ. ఇజ్రాయెల్ నుంచి వెళ్లిపోయిన 12 తెగలలో ఒక తెగకు చెందినవారుగా భావిస్తారు. 2005లోఎ అప్పటి చీఫ్ రబ్బీ వారిని ఇజ్రాయెల్ వారసులుగా గుర్తించి వారి ఇజ్రాయెల్ వలసలకు మార్గం సుగమం చేశారు. ఇప్పటికే బ్నీ మెనాõÙలో దాదాపు సగం మంది ఇజ్రాయెల్‌కు వలస వెళ్లి ఆ దేశ పౌరులుగా స్థిరపడ్డారు.


