ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు భారత్ పర్యటన రద్దైంది. ఇటీవల జరిగిన ఢిల్లీ ఎర్రకోట బాంబు పేలుళ్ల నేపథ్యంలో భద్రతా కారణాల రీత్యా నెతన్యాహు తన పర్యటన రద్దు చేసుకున్నట్లు తెలుస్తోంది. నెతన్యాహు భారత్ పర్యటన రద్దవడం ఈ ఏడాదిలో ఇది మూడోసారి.
భారత్- ఇజ్రాయెల్ మధ్య మైత్రి గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. భారత్ ఆపదలో ఉన్న ప్రతీసారి నేనున్నానంటూ ఇజ్రాయెల్ ఆపన్న హస్తం అందించడానికి సిద్ధంగా ఉంటుంది. అయితే ఆ దేశ అధ్యక్షుడు బెంజిమన్ నెతన్యాహు ఈ ఏడాది చివర్లో భారత్ రావాల్సి ఉండగా కొద్దిరోజుల క్రితం ఢిల్లీ ఎర్రకోట వద్ద జరిగిన బాంబు పేలుళ్ల నేపథ్యంలో తన పర్యటన రద్దు చేసకున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాదిలో బెంజిమెన్ పర్యటన రద్దుకావడం ఇది మూడోసారి. గతంలో సెప్టెంబర్ 19న ఒకరోజు పర్యటన నిమిత్తం భారత్ రావాల్సి ఉండగా ఆ పర్యటనను రద్దు చేసుకున్నారు. అంతకు ముందు ఏప్రిల్‌లో సైతం బెంజిమిన్ పర్యటన రద్దైంది.
బెంజిమిన్ నెతన్యాహు చివరిసారిగా 2018లో భారత్ లో పర్యటించారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ ఏడాది ఆయన ఇండియా వచ్చే అవకాశాలు లేనట్లే కనిపిస్తుంది. 2026లో నెతన్యాహు భారత్ లో పర్యటించి ప్రధాని మోదీతో సమావేశమయ్యే అవకాశముంది. ఢిల్లీ ఎర్రకోట వద్ద జరిగిన కారుబాంబు దాడిలో 13మంది మృతి చెందగా పలువురు గాయపడ్డ సంగతి తెలిసిందే.


