లెబనాన్‌పై ఇజ్రాయెల్‌ దాడులు.. 40 మంది మృతి | Israel Strikes On Lebanon 40 Killed | Sakshi
Sakshi News home page

లెబనాన్‌పై ఇజ్రాయెల్‌ దాడులు.. 40 మంది మృతి

Nov 10 2024 7:30 AM | Updated on Nov 10 2024 9:23 AM

Israel Strikes On Lebanon 40 Killed

బీరుట్‌:లెబనాన్‌పై ఇజ్రాయెల్‌ వైమానిక దాడులు తీవ్రం చేసింది. తాజాగా లెబనాన్‌ రాజధాని బీరుట్‌పై ఇజ్రాయెల్‌ జరిపిన దాడుల్లో 40 మంది మరణించారు. మృతుల్లో చిన్నపిల్లలు కూడా ఉన్నారని లెబనాన్‌ ప్రభుత్వం ప్రకటించింది.బీరుట్‌పైనే కాకుండా తీర నగరం టైర్‌పైనా ఇజ్రాయెల్‌ దాడులు చేసింది. 

గతంలో ఇక్కడ దాడులు చేస్తామని ముందే హెచ్చరించిన శనివారం జరిపిన దాడుల గురించి మాత్రం ఎలాంటి సమాచారమివ్వలేదని లెబనాన్‌ ఆరోగ్యశాఖ తెలిపింది. ఏడాది కాలంలో ఇజ్రాయెల్‌ జరిపిన దాడుల్లో లెబనాన్‌లో మొత్తం 3136 మంది మరణించారని, 13వేల మందికిపైగా గాయపడ్డారని లెబనాన్‌ అధికారులు తెలిపారు.   

కాగా, పాలస్తీనాలోని హమాస్‌తో పాటు లెబనాన్‌లోని హెజ్బొల్లా గ్రూపు మిలిటెంట్లపై ఇజ్రాయెల్‌ ఏకకాలంలో దాడులు చేస్తున్న విషయం తెలిసిందే.  హెజ్బొల్లా ఇరాన్‌కు మద్దతుగా పనిచేస్తోందన్న కారణంగా ఇటీవల ఇజ్రాయెల్‌ హెజ్బొల్లా లక్ష్యంగా లెబనాన్‌పై విరుచుకుపడుతోంది.

ఇదీ చదవండి: డీఏపీకి ‘గాజా’ దెబ్బ

Advertisement
 
Advertisement
Advertisement