ఇన్‌ఫ్లుయెన్సర్‌ కావడం ఇక ఈజీ కాదు! | Influencer Is Now a Degree: Social Media Careers Enter Classrooms | Sakshi
Sakshi News home page

ఇన్‌ఫ్లుయెన్సర్‌ కావడం ఇక ఈజీ కాదు!

Aug 17 2026 1:52 PM | Updated on Aug 17 2026 1:57 PM

Influencer Is Now a Degree: Social Media Careers Enter Classrooms

సోషల్‌ మీడియా స్టార్‌ కావడం.. ఇక సరదా వ్యవహారం కాదు. కంటెంట్‌ క్రియేషన్‌ను ఓ ప్రొఫెషన్‌గా గుర్తిస్తూ ఓ ప్రముఖ విశ్వవిద్యాలయం ఏకంగా డిగ్రీ కోర్సును ప్రారంభించింది. యూట్యూబ్‌, ఇన్‌స్టాగ్రామ్‌, టిక్‌టాక్‌ వంటి వేదికలపై కెరీర్‌ నిర్మించాలనుకునే వారికి ప్రత్యేక శిక్షణ అందించేలా ఈ కోర్సును రూపొందించారు. ఇప్పటికే ఇన్‌ఫ్లుయెన్సర్ల విషయంలో కొత్త రూల్స్‌ పుట్టుకొస్తున్నాయి. ఈ తరుణంలో.. ప్రొఫెనల్‌ డిగ్రీ మస్ట్‌ అంటే ఎలా? అనే చర్చ జోరందుకుంది.

ఇంటర్నెట్‌ తెరిస్తే చాలూ.. కంటెంట్‌ పేరిట బోలెడంత క్రింజ్‌ కనిపిస్తుంటుంది. అయితే దానికి చెక్‌ పెట్టాలని అమెరికాలోని అరిజోనా స్టేట్‌ యూనివర్సిటీ (ASU) నిర్ణయించింది. స్వచ్ఛమైన కంటెంట్‌ క్రియేషన్‌లో భాగంగా బ్యాచిలర్‌ డిగ్రీ ప్రోగ్రామ్‌ను ప్రారంభించింది. యూనివర్సిటీలోని వాల్టర్‌ క్రాంకైట్‌ స్కూల్‌ ఆఫ్‌ జర్నలిజం అండ్‌ మాస్‌ కమ్యూనికేషన్‌ ఆధ్వర్యంలో ఈ కోర్సు అందుబాటులోకి వచ్చింది. కేవలం వీడియోలు చేయడం, వైరల్‌ కావడం కాకుండా.. కంటెంట్‌ రూపకల్పన, పాడ్‌కాస్టింగ్‌, స్టూడియో ప్రొడక్షన్‌, కెమెరా ముందు ప్రెజెన్స్‌, డిజిటల్‌ మార్కెటింగ్‌ వంటి అంశాల్లో విద్యార్థులకు శిక్షణ ఇవ్వనున్నారు.

వైరల్‌ అయితే చాలు అనుకోవద్దు..
ఇటీవల కాలంలో ఇన్‌ఫ్లుయెన్సర్‌ కల్చర్‌ భారీగా పెరిగింది. సోషల్‌ మీడియా ద్వారా లక్షలాది మంది ఫాలోవర్లను సంపాదించి ఆదాయం పొందుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. దీంతో ‘క్రియేటర్‌ ఎకానమీ’ కూడా వేగంగా విస్తరిస్తోంది. అయితే ఇన్‌ఫ్లుయెన్సర్‌ జీవితం బయటకు కనిపించినంత సులభం కాదని నిపుణులు చెబుతున్నారు. నిరంతరం కొత్త కంటెంట్‌ సృష్టించడం, ప్రేక్షకులతో అనుసంధానం కొనసాగించడం, బ్రాండ్లతో ఒప్పందాలు చేసుకోవడం, ఆదాయంలో అనిశ్చితిని ఎదుర్కోవడం వంటి సవాళ్లు ఉంటాయని సూచిస్తున్నారు. ఇప్పటికే పలు ప్లాట్‌ఫారమ్‌లు కంటెంట్‌ విషయంలో కొత్త(కఠిన) రూల్స్‌ తెస్తున్న సంగతి తెలిసిందే.

డిగ్రీతో స్టార్‌ అవుతారా?
కంటెంట్‌ క్రియేషన్‌లో డిగ్రీ చేసినంత మాత్రాన ప్రతి ఒక్కరూ సోషల్‌ మీడియా స్టార్‌ కాలేరని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. వైరల్‌ కావడానికి ప్రతిభతో పాటు అదృష్టం, సరైన వ్యూహం, నిరంతర శ్రమ అవసరమని చెబుతున్నారు. అయితే ఈ కోర్సు ద్వారా కమ్యూనికేషన్‌ నైపుణ్యాలు, మార్కెటింగ్‌, వ్యక్తిగత బ్రాండింగ్‌, నెట్‌వర్కింగ్‌ వంటి అంశాల్లో అవగాహన పెరుగుతుందని విశ్వవిద్యాలయం పేర్కొంది. సోషల్‌ మీడియా రంగంలోనే కాకుండా మీడియా, ప్రకటనలు, డిజిటల్‌ సంస్థల్లోనూ ఈ నైపుణ్యాలు ఉపయోగపడతాయని చెబుతున్నారు.

క్రియేటర్‌ ఎకానమీకి కొత్త గుర్తింపు
అమెరికాలో కంటెంట్‌ క్రియేషన్‌ రంగం వేగంగా వృద్ధి చెందుతోంది. ఈ రంగంలో బిలియన్ల డాలర్ల ఆదాయం చలామణి అవుతోంది. దీంతో ఇంతకాలం కేవలం ‘టైమ్‌పాస్‌’గా భావించిన సోషల్‌ మీడియా కంటెంట్‌ సృష్టి.. ఇప్పుడు ఓ అధికారిక కెరీర్‌ మార్గంగా గుర్తింపు పొందుతోంది. అందుకే ఇకపై ‘ఇన్‌ఫ్లుయెన్సర్‌ అవుతా’ అంటే చిన్నచూపు చూడాల్సిన అవసరం లేదన్న సంకేతాన్ని ఈ డిగ్రీ ఇస్తోంది. అయితే ఫాలోవర్ల సంఖ్య కంటే.. నాణ్యమైన కంటెంట్‌, సృజనాత్మకత, క్రమశిక్షణే విజయానికి అసలు ఆధారమని నిపుణులు గుర్తుచేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement