400 మంది హిజ్బుల్లా ఫైటర్స్ మృతి | iran war more than 400 hezbollah fighters killed in war with israel | Sakshi
Sakshi News home page

400 మంది హిజ్బుల్లా ఫైటర్స్ మృతి

Mar 28 2026 3:51 AM | Updated on Mar 28 2026 3:53 AM

 iran war more than 400 hezbollah fighters killed in war with israel

ఇజ్రాయెల్‌ జరుపుతున్న దాడులలో ఇప్పటివరకు 400 మందికి పైగా హిజ్బుల్లా ఫైటర్లు మృతి చెందినట్లు రాయిటర్స్ కథనం పేర్కొంది.  దానితో పాటు లక్షల సంఖ్యలో ప్రజలు నిరాశ్రయులైనట్లు తెలిపింది.

ఇజ్రాయెల్ ఏకకాలంలో ఇరాన్‌పై దాడులు చేస్తూనే ఇటు లెబనాన్‌పై విరుచుకపడుతుంది. ఆ దేశంలోని నేరుగా సాయుధబలగాల్ని రంగంలోకి దింపింది. ఈ నేఫథ్యంలోనే ఆ ప్రాంతంలో భారీగా దాడులు చేస్తోంది. ఈ అటాక్స్‌ వల్ల ఇప్పటికే లక్షలో సంఖ్యలో ప్రజలు నిరాశ్రయులయ్యారు. కాగా 400కు పైగా హిజ్బుల్లా తీవ్రవాదులు మృతిచెందినట్లు నివేదికలు రాయిటర్స్ కథనం పేర్కొంది. ఈ వివరాల్ని హిజ్బుల్లా సమూహానికి చెందిన వ్యక్తులు అందజేసినట్లు తెలిపింది.

అయితే హిజ్బూల్లా మాత్రం ఇప్పటివరకూ ఎటువంటి అధికారిక వివరాలను ప్రచురించలేదు. కొంతమంది  ప్రముఖమైన వ్యక్తులు మరణించిన సందర్భంలో వారి వివరాలను వెల్లడించింది. కాగా  ఇజ్రాయెల్ మాత్రం ఈ దాడులలో కనీసం 700 మంది హిజ్బుల్లా ఫైటర్లను మరణించినట్లు పేర్కొంది.  ఇందులో వందలాది మంది ఆ సమూహానికి చెందిన ఎలైట్ 'రాద్వాన్ ఫోర్స్' సభ్యులు ఉన్నారని తెలిపింది.

లెబనాన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ శుక్రవారం తెలిపిన వివరాల ప్రకారం  ఇజ్రాయెల్ దాడులు మరియు భూతల కార్యకలాపాల వల్ల లెబనాన్‌లో ఇప్పటివరకూ  1,142 మంది మరణించారని, వీరిలో 122 మంది పిల్లలు, 83 మంది మహిళలు మరియు 42 మంది వైద్య సిబ్బంది ఉన్నారని పేర్కొంది. కాగా 2023-2024లో ఇజ్రాయెల్‌తో జరిగిన యుద్ధంలో దాదాపు 5 వేల వరకూ హిజ్బుల్లా ఫైటర్స్‌ మృతిచెందినట్లు లెబనాన్‌ ప్రకటించింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement