ఇజ్రాయెల్ దాడి.. ప్రముఖ ఇన్‌ప్లూయెన్సర్ ఫ్యామిలీ మృతి | Israeli Airstrike In Lebanon Claims Lives Of Influencer’s Family, Check More Details Inside | Sakshi
Sakshi News home page

ఇజ్రాయెల్ దాడి.. ప్రముఖ ఇన్‌ప్లూయెన్సర్ ఫ్యామిలీ మృతి

Mar 17 2026 1:02 AM | Updated on Mar 17 2026 11:22 AM

 lebanon airstrike influencer family killed

పశ్చిమాసియా యుద్దంలో మరణాలు నానాటికీ పెరుగుతున్నాయి. లెబనాన్‌పై ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడిలో  ప్రముఖ లెబనీస్ ఇన్‌ప్లూయెన్సర్ నటాలీ కమల్ తన కుటుంబాన్ని కోల్పోయింది. ఆమె ఆరోగ్య పరిస్థితి సైతం ప్రస్తుతం విషమంగా ఉంది.

ఇజ్రాయెల్ ఓవైపు ఇరాన్‌పై దాడులు చేస్తూనే మరోవైపు లెబనాన్‌పై విరుచుకపడుతుంది. హిజ్బుల్లా స్థావరాలే లక్షంగా పెద్దఎత్తున మిసైల్స్ అటాక్ చేస్తోంది. టెల్ అవీవ్ ఆ దేశంలోకి  చొచ్చుకొని కంబాట్ ఆర్మీ ఆపరేషన్ చేపడుతుంది. ఈ దాడుల నేపథ్యంలో  ఆ దేశంలోని సాధారణ ప్రజలు సైతం దాడులలో పెద్దఎత్తున మృత్యువాత పడుతున్నారు.

ఈ నేపథ్యంలోనే మౌంట్ లెబనాన్ ప్రాంతంలోని ఒక అపార్ట్‌మెంట్‌ను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ దాడి చేసింది. ఈ దాడిలో ప్రముఖ సోషల్ మీడియా ఇన్‌ప్లూయెన్సర్ నటాలీ భర్త మెుహమ్మద్ షెబాద్, ఆమె చిన్న కుమార్తె తాలిన్ మరణించారు. అంతేకాకుండా ఈ అటాక్‌లో నటాలీ సైతం తీవ్రంగా గాయపడ్డారు. దీంతో ఆమెను హుటాహుటీన ఆసుపత్రికి తరలించగా ఆమె అక్కడ చికిత్స పొందుతున్నట్లు తెలుస్తోంది.

కాగా ఈ దాడి జరిగిన ప్రాంతం బీరూట్‌కు 10 కిలోమీటర్ల దూరంలో ఉంది. యుద్ధం నేపథ్యంలో ఆశ్రయం కోల్పోయిన అనేక కుటుంబాలు అక్కడ ఆశ్రయం పొందుతున్నాయి. ఆ ప్రాంతంపై ఇజ్రాయెల్ అటాక్ చేసిందని ఆ దేశ మీడియా కథనాలు పేర్కొన్నాయి. ఈ దాడిలో మెుత్తంగా ముగ్గురు మరణించినట్లు అక్కడి అధికారులు ప్రకటించారు.

Advertisement
 
Advertisement
Advertisement