రాయచూరు రూరల్: విద్యుత్ రంగాన్ని ప్రైవేట్ పరం చేయడం తగదని రాష్ట్ర రైతు సంఘం డిమాండ్ చేసింది. మంగళవారం హట్టి జెస్కాం కార్యాలయం వద్ద చేపట్టిన ఆందోళనలో అధ్యక్షుడు నాగరాజ్ మాట్లాడారు. అధికారులు రైతుల వ్యవసాయ పంప్‌సెట్లకు స్మార్ట్‌కార్డులు, డిజిటల్ మీటర్లు అమర్చే పనిని మానుకోవాలన్నారు. పంప్‌సెట్లకు స్మార్ట్‌కార్డులు, డిజిటల్ మీటర్ల అమరికకు రూ.10 వేలు డిపాజిట్ చేయాలని ఆదేశించడం భావ్యం కాదన్నారు. రైతులకు విద్యుత్ పరికరాలను అక్రమ సక్రమ పథకం కింద అందించాలన్నారు. ప్రభుత్వం విద్యుత్ శాఖ ప్రైవేటీకరణ చేయడం మానుకోవాలని కోరుతూ స్థానికాధికారి ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రికి వినతిపత్రం సమర్పించారు.


