అక్రమ రేషన్‌ బియ్యం స్వాధీనం | - | Sakshi
Sakshi News home page

అక్రమ రేషన్‌ బియ్యం స్వాధీనం

Mar 5 2026 7:40 AM | Updated on Mar 5 2026 7:40 AM

హొసపేటె: ఆహార, పౌర సరఫరాల శాఖ అధికారులు, పోలీసులు దాడి చేసి తాలూకాలోని కాకుబాళు గ్రామంలోని కరియమ్మన గుడి సమీపంలో ఒక ఇంటి ముందు అక్రమంగా నిల్వ చేసిన రేషన్‌ బియ్యాన్ని బుధవారం స్వాధీనం చేసుకున్నారు. ఈ దాడిలో నిర్ధిష్ట సమాచారం ఆధారంగా దాదాపు 60.80 క్వింటాళ్ల రేషన్‌ బియ్యాన్ని లైసెన్స్‌ లేకుండా అక్రమంగా నిల్వ చేసినట్లు గుర్తించారు. స్వాధీనం చేసుకున్న బియ్యం విలువ సుమారు రూ.2,10,368 ఉంటుందని అంచనా వేశారు. ఈ విషయంపై హొసపేటె గ్రామీణ పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైనట్లు ఆహార, పౌర సరఫరాల శాఖ డిప్యూటీ డైరెక్టర్‌ రియాజ్‌ అన్నారు. ఇలాంటి చట్ట విరుద్ధ కార్యకలాపాల గురించి ప్రజలు సమాచారం అందించాలని ఆయన కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement