లేక్ సిటీ, ప్రశాంతతకు నెలవైన ఉదయపూర్ (రాజస్థాన్) నగరం పలువురు సెలబ్రిటీల వివాహాది శుభకార్యాలకు హాట్‌స్పాట్. ప్రస్తుతం ఈ రాజ నగరం మరో గొప్ప విలాసవంతమైన వివాహానికి వేదికగా మారనుంది.
జూ. ట్రంప్, , 40దేశాలనుంచి 126 మంది స్పెషల్ గెస్ట్స్
అమెరికన్ బిలియనీర్ వ్యాపారవేత్త రామరాజు మంతెన కుమార్తె నేత్ర మంతెన. అమెరికాకు చెందిన వరుడు వంశీ గదిరాజు వివాహ వేడుక జరుగనుంది. రాజస్థాన్ నడిబొడ్డున ఒక స్టార్-స్టడెడ్ ఈవెంట్‌కు అమెరి కాఅధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమారుడు డొనాల్డ్ ట్రంప్ జూనియర్ కూడా వస్తారని అంచనా. దీంతో ఈ నగరం ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తోంది. ఇక్కడ భద్రతను కట్టుదిట్టం చేశారు.దాదాపు 40 దేశాల నుండి 126 మంది ప్రత్యేక అతిథులుగా హాజరు కానున్నారు.
నవంబర్ 21–22 తేదీలలో ఉదయపూర్‌లో రెండు రోజుల పాటు ఘనంగా డెస్టినేషన్ వెడ్డింగ్ జరగనుంది. ఫార్మాస్యూటికల్ సీఈఓ రామరాజు మంతెన కుమార్తె నేత్ర మంతెన, వంశీ గదిరాజు కళ్యాణం అంగరంగ వైభవంగా జరగనుంది. డొనాల్డ్ ట్రంప్ జూనియర్‌తోపాటు, జెన్నిఫర్ లోపెజ్ ,స్టిన్ బీబర్‌ల పవర్‌హౌస్ షోస్ ఉంటాయి పలువురు సినీ, రాజీకయ రంగ ప్రముఖుల అతిథులతో ఐకానిక్ ప్యాలెస్‌లలో వేడుకలు జరగనున్నాయి. బాలీవుడ్ సె లబ్స్ హృతిక్ రోషన్, రణవీర్ సింగ్, నోరా ఫతేహి, మాధురి దీక్షిత్ , దియా మీర్జా, షాహిద్ కపూర్ నోరా ఫతేహి, వరుణ్ ధావన్, కృతి సనన్, జాన్వీ కపూర్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్ తదితరులు ప్రత్యేక ఆకర్షణగా ఉండనున్నారు.
చదవండి : ఇంటర్న్స్ కావాలి, నెలకు రూ. లక్ష స్టైఫండ్ : ట్విస్ట్ ఏంటంటే
రాజస్థాన్ రాజ నిర్మాణ వైభవాన్ని ప్రదర్శించే అత్యంత ప్రసిద్ధ వారసత్వ ప్రదేశాల్లో ఈ వెడ్డింగ్ వేడుకలు నిర్వహిస్తున్నారు. చారిత్రాత్మక సిటీ ప్యాలెస్ కాంప్లెక్స్‌లోని ది లీలా ప్యాలెస్ ఉదయపూర్, మానెక్ చౌక్ , జెనానా మహల్,అలాగే పిచోలా సరస్సులోని గంభీరమైన జగ్‌మందిర్ ఐలాండ్ ప్యాలెస్‌లలో లగ్జరీ ప్రీ వెడ్డింగ్ వేడుకలు జరుగుతాయి.
ఎవరీ రాజు మంతెన
భారత సంతతికి చెందిన వారు రాజు మంతెన. అమెరికాలో ప్రధాన కార్యాలయం కలిగిన ప్రముఖ ఫార్మాస్యూటికల్ కంపెనీ ఇంజెనస్ ఫార్మాస్యూటికల్స్ ఛైర్మన్ అండ్ సీఈవో ICORE హెల్త్‌కేర్, ఇంటర్నేషనల్ ఆంకాలజీ నెట్‌వర్క్ (ION) , ఆన్కోస్క్రిప్ట్‌ల వ్యవస్థాపకుడిగా మంతెన ఆరోగ్య సంరక్షణ రంగంలో అమెరికా మంచి పేరు సంపాదించారు.
ఇది చదవండి : రైలు ఏసీ కోచ్‌లో మ్యాగీ : వీడియో వైరల్, నెటిజన్లు ఫైర్


