కుటుంబాలతో కలిసి రైల్లో ప్రయాణించేటపుడు ఎక్కువ ఫుడ్‌ను ఆస్వాదిస్తాం. పులిహోర, దద్జోజనం, పూరీలు చికెన్, స్వీట్ పూరీలు, చపాతీలు, బిర్యానీ , టీ-కాఫీ వరకు రకరకాలుగా ముందే ప్రిపేర్ చేసుకుని వెళ్లి, రైలు బోగీలో తింటూ ఉండే అదో ఆనందం. ముఖ్యంగా పిల్లలు ఇలాంటి జర్నీలను బాగా ఎంజాయ్ చేస్తారు. మారు మాట్లాడకుండా, మారం చేయకుండా చక్కగా తింటారు.
మరో విధంగా చెప్పాలంటే ఇదొక మధురమైన జ్ఞాపకంగా ఉంటుంది. అయితే మరికొంతమంది వేడి వేడిగా తినడానికి ఇష్టపడతారు. అయితే రైల్వే క్యాంటీన్‌లో ఆర్డర్ చేసకుంటాం. లేదంటే రైలు ఆగినపుడు ఆయా స్టేషన్లలో కొనుక్కుంటాం. కానీ మహారాష్ట్ర మహిళ చేసిన పని గురించి తెలుసుకుంటే అవాక్కవుతారు. పదండి ఆ కథా కమామిష్షు ఏంటో తెలుసుకుందాం.
ఇదీ చదవండి: భారత టెకీ కష్టాలు: రూ. 70 లక్షల ఉద్యోగం పోయింది, సేవింగ్స్ కూడా!
మహారాష్ట్రకు చెందిన ఒక మహిళ ఏకంగా ఏసీ రైలు బోగీలోనే మ్యాగీ తయారు చేసింది. రైలు ఏసీ కంపార్ట్‌మెంట్‌లోని చార్జింగ్ సాకెట్‌లో ఎలక్ట్రిక్ కెటిల్ పెట్టి కెటిల్‌లో ఇన్‌స్టంట్ నూడుల్స్ ప్రిపేర్ చేసింది పైగా కెమెరాకు చక్కగాఫోటోలకు పోజులిచ్చింది.దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. రైలులో మ్యాగీ వేడిగా వడ్డిస్తే తినడం బాగానే ఉంటుంది, కానీ సేఫ్టీ పరిస్థితి ఏంటి అంటూ నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మరికొందరు మినిమం సెన్స్ లేదు, ఇలా చేస్తే చాలా ప్రమాదకరం కదా అని కమెంట్ చేశారు. రైలులోని ఎలక్ట్రికల్ సర్క్యూట్‌పై అదనపు భారం పడి మంటలు చెలరేగే ప్రమాదం ఉందని మరికొందరు హెచ్చరించారు.
This is a major safety hazard and can cause fire endangering lives of all onboard. That's why we cannot have good things. Many will misuse the facilities and then be proud of it. Most lack civil sense. pic.twitter.com/JSRCpIXPW9
— Backpacking Daku (@outofofficedaku) November 20, 2025
"చాలా ఏళ్ల క్రితం, చెన్నై నుండి టాటానగర్‌కు రైలులో వెళుతుండగా, ఒక కుటుంబం పూజ చేసి అగర్ బత్తి, కర్పూరం వెలిగించింది. నేను వెంటనే టీసీకి ఫిర్యాదు చేశాను ఈ రోజుల్లో జనానికి బుద్ధి లేదు. ఇలాంటి పిచ్చి పనులు మానడం లేదు.’’ అంటూ గతంలో తనకు ఎదురైన అనభవాన్ని షేర్ చేశారొకరు. డబ్బులు పెట్టి టికెట్ కొనుక్కున్నంత మాత్రాని, మొత్తం ప్రయాణికుల ప్రాణాల్ని ఫణంగా పెట్టే పనులు చేస్తే ఎలా అంటూ ప్రశ్నించారు.


