
ఆంధ్రప్రదేశ్‌లోని ఆత్రేయపురం గ్రామం ఫేమస్ వంటకం పూతరేకులు. జీఐ ట్యాగ్ దక్కించుకున్న ఈ స్వీట్ వివాహాలు, పండుగల్లో భాగమై అందరు ఇష్టపడే వంటకంగా పేరుతెచ్చుకుంది. అలాంటి ఫేమస్ స్వీట్‌ని నచ్చిన పర్యాటనలకు వెళ్లినప్పుడూ కూడా వెంట తీసుకువెళ్తాం. అది కామన్. కానీ ఎత్తైన పర్వతాలను ట్రెక్కింగ్ చేస్తున్నప్పుడూ లేదా ఎముకలు కొరికే చలిప్రాంతాల్లో దీన్ని ఆస్వాదించే ప్రయత్నం చేశారా.!. ఇదంతా ఎందుకంటే 16 వేల అడుగుల ఎత్తులో హిమగిరులను చూస్తూ.. తెల్లటి కాగితం పొరల్లా ఉండే ఈ పూతరేకులను తింటే ఎలా ఉంటుందో ఆలోచించారా..? ఇంకెందుకు ఆలస్యం తింటే ఎలా ఉంటుందో తెలుసుకుందాం రండి మరి..
ఆధ్యాత్మిక గురు సద్గురు జగ్గీ వాసుదేవ్,ఈశా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు ఆ ప్రయత్నం చేశారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఆయన తన కైలస యాత్రలో భాగంగా..16,400 అడుగుల ఎత్తులో ఉన్న హిమాలయాలను చూస్తూ..ఈ స్వీట్‌ని ఆస్వాదించారు. ఎతైన, కొండలు, మంచు పర్వతాల వద్ద కొన్ని వంటకాలు రుచి మారుతుంది. ఒక్కోసారి పాడైపోతాయి కూడా.
బ్రెడ్, ఎనర్జీ బార్‌లు, చాక్లెట్లు సూప్ లాంటివి అక్కడ చలికి బాగా గట్టిగా మారిపోతాయి. తినేందుకు అంత బాగోవు కూడా. మరి ఈ వంటకం రుచి కూడా అలానే ఉంటుందా..! అన్నట్లుగా సద్గురు ఆ ప్రదేశంలో ఈ గ్రామీణ వంటకాన్ని తింటూ..చిన్నపిల్లాడి మాదిరిగా ఎంజాయ్ చేశారు. బహుశా నాలా ఎవ్వరూ ఈ ప్రాంతంలో ఈ టేస్టీ.. టేస్టీ.. వంటకాన్ని తిని ఉండరు..
హ్హ..హ్హ.. అంటూ ఆనందంగా తినేశారు. ఈ ఎత్తైన హిమాలయాలు భక్తికి నియంగానే కాదు ప్రముఖ వంటకాలను ఆస్వాదించేందుకు వేదికగా మారిందా అన్నట్లుంది కదూ..!. ఆంధ్రప్రదేశ్‌లోని ఆత్రేయపురంకి చెందిన ఈ గ్రామీణ వంటకం హిమాలయాల వద్ద కూడా దాని రుచిని, రంగుని కోల్పోలేదు. ఇది గ్రామీణ వంటకం గొప్పతనానికి నిదర్శనం కాబోలు. పొరలు పొరలుగా చక్కెర లేదా బెల్లం యాలకులు, డ్రైప్రూట్స్, నెయ్యితో చేసే వంటకం నోట్లో పెట్టుకోగానే వెన్నలా కరిగిపోతుంది. అబ్బా..! తలుచుకుంటేనే నోరూరిపోతుంటుంది.
(చదవండి: శునకాలనే దైవంగా ఆరాధించే క్షేత్రం..! ఎక్కడుందంటే..)