
విదేశాల్లో సెటిల్ అవ్వడం చాలామంది యువత డ్రీమ్. విదేశాల్లో ఉన్నత చదువులు చదువుకుని అక్కడే సెటిల్ అవ్వాలనుకుంటారు. కానీ అలాంటి ఆలోచన చేసే ముందు అక్కడ నియమ నిబంధనలు గురించి క్షణ్ణంగా తెలుసుకోవాలి లేదంటే..తీరా కోర్సు పూర్తి చేశాక ఉద్యోగం చేసేందుకు వీలు లేకపోతే పరిస్థితి అగమ్యగోచరం. అందుకు నిర్ణయం తీసుకునే ముందు ఆలోచించండి అంటోంది ఈ బెంగళూరు మహిళ.
అసలేం జరిగిందంటే..కెనడాలో క్యాబ్ నడుపుతున్న ఒక వైద్యుడిని కలిసిన బెంగళూరుకి చెందిన మేఘన శ్రీనివాస్ అందుకు సంబంధించిన వీడియో సంభాషణను నెట్టింట షేర్ చేశారు. మిస్సిసాగా నుంచి టొరంటోకు ట్రావెల్ చేస్తుండగా ఆ డ్రైవర్‌ని కలిశారామె. అఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చి ఆ డ్రైవరర్ తాను కెనడాలో డిగ్రీ చదువుతున్నట్లు తెలిపాడు.
తన ఖర్చుల కోసం అని క్యాబ్‌నడుపుతున్నట్లు ఆమెతో చెప్పాడు. క్యాబ్ నడపుతూ తాను రూ. 3 లక్షల వరకు సంపాదిస్తున్నానని, అందులో కేవలం సింగిల్ బెడ్‌రూం కోసమే ఏకంగా రూ 2 లక్షలు పైనే ఖర్చు చేస్తున్నట్లు మేఘనతో వాపోయాడు. తాను గతంలో అమెరికా, కెనడా సైనిక వైద్యుడిగా పనిచేసినట్లు తెలిపారు. ప్రస్తుతం కెనడాలో ప్రజప్రతినిధిగా ఉన్నట్లు తెలిపారు. తాను కెనడాలో తన వైద్య వృత్తిని కొనసాగించడానికి, వైద్య లైసెన్సు పొందేందుకు నానా తిప్పలు పడుతున్నట్లు చెప్పుకొచ్చారు.
చివరగా ఆ వీడియోలో మేఘన దయచేసి కెనడాలో సెటిల్ అవ్వాలనుకుంటే అన్ని విషయాలను తెలుసుకుని సరైన విధంగా ప్లాన్ చేసుకోవాలని సూచించారు. అలాగే భవిష్యత్తులో ఇక్కడకు రావాలనుకునే విద్యార్థులు కూడా ఇక్కడ విద్యా వ్యవస్థ తీరు తెన్నులు..జీవిత వాస్తవాలు గుర్తించి పూర్తిగా తెలుసుకుని రావడం మంచిదని చెప్పుకొచ్చింది మేఘన.
చివరగా ఆమె ఈ దేశం మనకు అద్భతమైన అవకాశాలను ఇస్తుంది. అందులో ఎలాంటి సందేహం లేదు కానీ అందుకు అచంచలమైన ఓర్పు చాలా అవసరమని అన్నారామె. నెటిజన్లు సైతం ఈ వీడియోని చూసి..అంతర్జాతీయ వైద్య గ్రాడ్యుయేట్లకు సంబంధించి.. నియమాలు, చట్టాల మారాయి. స్థానికత లభించడం దాదాపు అసాధ్యం అని ఒకరు, విదేశీ వైద్యులు అక్కడ ఉద్యోగం పొందడం చాలా కష్టం అని అభిప్రాయం వ్యక్తం చేస్తూ పోస్టులు పెట్టారు.
(చదవండి: 'కూతుళ్లు మన ఇంటి లక్ష్మీ దేవతలు'..! వారి రాకతోనే..: నీతా అంబానీ)