
ఆడపిల్లలను ఇంటి లక్ష్మిగా కీర్తిస్తుంటారు మన పెద్దలు. ఆ విషయాన్ని గుర్తుచేశారు రిలయన్స్ ఫౌండేషన్ చైర్‌పర్సన్ నీతా అంబానీ. ఈ దీపావళి పండుగలో వెలుగుని తెచ్చేది కూతుళ్లే అంటూ హృదయపూర్వక సందేశాన్ని అందించారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
రిలయన్స్ దీపావళి పార్టీలో నీతా అంబానీ కూతుళ్ల కోసం జరుపుకునే పండుగగా అభివర్ణించిన సందేశం ప్రతి ఒక్కరు మనుసును హత్తుకుంది. తరుచుగా మన పెద్దలు చెప్పేమాటను ఆమె గుర్తు చేస్తూ..ఈ పండుగ అందమే కూతుళ్లని, వారి రాకతోనే మన ఇల్లుకాంతిమయం అవుతుందంటూ భావోద్వేగంగా మాట్లాడారు.
అంతేగాదు. తన మనవరాళ్లు ఆదియ శక్తి పిరమల్, వేద అంబానీలను తన ఇంటి లక్ష్మీగా పరిచయం చేసింది. వారి వల్ల తమ ఇల్లు వెలిగిపోతుంటుందని, నట్టింట వారు నడయాడుతుంటే లక్ష్మీ దేవి ఉన్నట్లే అనిపిస్తుందని అన్నారామె. భారతీయ సంప్రదాయంలో కూమార్తెలను లక్ష్మీదేవత ప్రతిరూపంగా భావిస్తుంటారు. వారి వల్లే తమ ఇంటి శ్రేయస్సు, ఆనందం, అదృష్టమని ప్రగాఢంగా విశ్వసిస్తారు.
దాన్ని ఆమె ఈ పండుగ నేపథ్యంలో గుర్తు చేస్తూ..ఆడపిల్లలు మన ఇంటి లక్ష్ములు అంటూ మన సంస్కృతిని లింగ సమానత్వం, సాధికారతను మిళితం చేసేలా గొప్పగా సందేశమిచ్చారామె. అంతేగాదు ఈ పండుగకు అసలైన అర్థం, అంతరార్థం బహుచక్కగా వివరించి.. నెటిజన్ల మనసును దోచుకున్నారామె. పైగా కుటుంబం విలువను తెలియజేసేలా ఐక్యత, ప్రేమ, అనేవి దీపాల వెలుగల వలే మన జీవితాల్ని కాంతిమయం చేస్తాయని తన భావోద్వేగ సందేశంతో చెప్పకనే చెప్పారు నీతా అంబానీ.
(చదవండి: Hungover After Diwali: దీపావళి హ్యాంగోవర్‌ని తగ్గించే నేచురల్ డిటాక్స్..తక్షణ ఉపశమనం!)