
పవన్ కల్యాణ్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ఓజీ (They Call Him OG Movie). ప్రియాంక అరుళ్ మోహన్ కథానాయిక. ప్రకాశ్ రాజ్ కీలక పాత్ర పోషించిన ఈ మూవీలో బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ విలన్‌గా యాక్ట్ చేశాడు. రన్ రాజా రన్, సాహో సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న సుజీత్ దర్శకత్వం వహించాడు. డీవీవీ దానయ్య నిర్మించగా తమన్ సంగీతం అందించాడు.
సాంగ్ రిలీజ్
సెప్టెంబర్ 21న ఓజీ ట్రైలర్ రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అయితే దానికంటే ముందు ఓ సర్‌ప్రైజ్ వదిలారు. పవన్ పాడిన 'వాషియో వాషి' పాటను రిలీజ్ చేశారు. ఇది జపనీస్ భాషలో సాగుతుంది. అయితే ఇదంతా పవన్ ఏదో డైలాగులు చెప్తున్నట్లు ఉందే తప్ప అసలు పాటలానే లేదు.
డబ్బులు దండుకునే పని
ఇక ఓజీ సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాల్లో టికెట్ రేట్లను భారీగా పెంచారు. ప్రజల కోసం, ప్రజల కొరకు అంటూ డైలాగులు చెప్పే పవన్.. తన సినిమావంతు వచ్చేసరికి మాత్రం ప్రజల జేబులో డబ్బులు దండుకోవడానికి ఏమాత్రం వెనకడుగు వేయకపోవడం గమనార్హం. కాగా ఓజీ మూవీ సెప్టెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది.