
మహానటి చిత్రంతో జాతీయ ఉత్తమ నటి అవార్డు గెలుచుకున్న కీర్తి సురేశ్ (Keerthy Suresh)కు 2024 పెద్దగా కలిసి రాలేదు. వృత్తిపరంగా వరుస అపజయాలను చవి చూసిన ఆమె వ్యక్తిగతంగా మాత్రం మధురమైన ఘట్టానికి చేరుకున్నారు. తన చిరకాల మిత్రుడు ఆంటోనితో పెళ్లి చేరుకున్నారు. అయితే సినిమాలకు మాత్రం కాస్త దూరం అయ్యారనే చెప్పాలి. ఈమె నటించిన రఘు తాత, హిందీ చిత్రం మేరీజాన్ చిత్రాలు నిరాశపరిచాయి. ఉప్పు కప్పరంబు అనే వెబ్‌సీరీస్‌లో నటించినా, అది ఓటీటీలో స్ట్రీమింగ్ కావడంతో పెద్దగా రీచ్ కాలేదు. అయితే వాణిజ్య ప్రకటనల్లో నటిస్తూ బాగానే డబ్బు సంపాదించారు.
సినిమా
ఇప్పుడు కీర్తి సురేశ్ మళ్లీ బిజీ అయ్యారు. ఇప్పటికే తెలుగులో రెండు కొత్త చిత్రాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇంతకుముందు నటించిన రెండు చిత్రాలు విడుదల కావాల్సి ఉంది. వాటిలో ఒకటి రివాల్వర్ రీటా (Revolver Rita Movie). ఉమెన్ సెంట్రిక్ కథాంశంతో రూపొందిన ఈ చిత్రానికి చంద్రు దర్శకుడు. ఫ్యాషన్ స్టూడియోస్, ది రూట్ సంస్థలు నిర్వహించిన ఈ చిత్రం త్వరలో తెరపైకి రావడానికి సిద్ధమవుతోంది. శుక్రవారం (అక్టోబర్ 17) కీర్తిసురేష్ 34వ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆమెకు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ రివాల్వర్ రీటా చిత్ర యూనిట్ ఒక సాంగ్ విడుదల చేసింది.