
సోషల్ మీడియా వచ్చాక సెలబ్రిటీలకు ప్రైవసీ అనేది లేకుండా పోతోంది. వారి ఫోటోలను ఎలా పడితే అలా మార్ఫింగ్ చేసి పోస్ట్ చేస్తున్నారు. ముఖ్యంగా సినీ స్టార్స్ ఇలాంటి వాటి బారిన పడుతున్నారు. తాజాగా జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఇదే విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫోటోలను మార్ఫింగ్ చేస్తున్నారంటూ సీపీ సజ్జనార్‌కు కంప్లైంట్ ఇచ్చారు. ఈ మేరకు ఎన్టీఆర్ అభిమానుల సంఘం సభ్యుడు నందిపాటి మురళి సీపీని కలిసి ఫిర్యాదును సమర్పించారు.
తమ హీరో ఎన్టీఆర్ ఫొటోలను మార్ఫింగ్ చేసి అసభ్యకర రీతిలో సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సీపీని కోరారు. ఇప్పటికే చాలా సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో ఎన్టీఆర్ ప్రతిష్ట దెబ్బ తీసేలా ఉన్న వాటిని తొలగించేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఇటీవల కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో ఎన్టీఆర్ ఫొటోలను అసభ్యకరంగా మార్ఫింగ్ చేసి ట్రోల్స్, మీమ్స్ చేస్తున్నారు. ఈ సందర్భంగా సెలబ్రిటీలను వ్యక్తిగతంగా ట్రోల్స్ చేస్తున్న వారిపై చర్యలు తీసుకుంటామని సీపీ సజ్జనార్ తెలిపారు.
We sincerely thank Hyderabad Commissioner of Police Mr. V.C. Sajjanar, IPS garu, and the entire Hyderabad Police Department for their prompt response and assurance to take swift and appropriate action against those responsible for morphing and posting objectionable content… pic.twitter.com/Pg4dX2k4in
— NandipaTi muRali (@NtrMurali9999) October 22, 2025