కిష్కింధపురి మూవీ.. థీమ్ సాంగ్ ఫుల్ వీడియో వచ్చేసింది | Bellamkonda Sreenivas Kishkindhapuri Theme song Full Video out now | Sakshi
Sakshi News home page

Theme song Full Video: కిష్కింధపురి మూవీ.. ఫుల్ వీడియో సాంగ్ రిలీజ్

Oct 22 2025 6:41 PM | Updated on Oct 22 2025 8:46 PM

Bellamkonda Sreenivas Kishkindhapuri Theme song Full Video out now

బెల్లంకొండ శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన హారర్ మూవీ 'కిష్కింధపురి'(Kishkindhapuri). కౌశిక్‌ పెగళ్లపాటి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌ టాక్‌ను సొంతం చేసుకుంది. సెప్టెంబర్‌ 12న విడుదలైన ఈ చిత్రం రూ. 30 కోట్లకు పైగానే వసూళ్లు రాబట్టింది.

తాజాగా ఈ మూవీ నుంచి థీమ్ సాంగ్‌ను రిలీజ్ చేశారు. కిష్కింధపురి థీమ్ పేరుతో ఫుల్ వీడియో సాంగ్‌ విడుదల చేశారు. ఈ పాటకు చైతన భరద్వాజ్ సంగీతమందించారు. కాగా.. ఈ  సినిమాను దాదాపు రూ. 20 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించారు. ప్రస్తుతం ఈ మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. జీ5 వేదికగా అక్టోబర్ 17 నుంచి అందుబాటులోకి వచ్చేసింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement