breaking news
little hearts
-
ఓటీటీకి వచ్చేస్తోన్న మలయాళ హిట్ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఓటీటీల్లో మలయాళం సినిమాలకు క్రేజ్ ఓ రేంజ్లో ఉంటోంది. గతంలో వచ్చిన చాలా సినిమాలు ప్రేక్షకుల ఆదరణ దక్కించుకున్నాయి. మలయాళంలో సూపర్‌హిట్‌గా నిలిచిన చిత్రాలు తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. మంజుమ్మెల్ బాయ్స్, ప్రేమలు లాంటి టాలీవుడ్ ప్రియులను అలరించాయి. తాజాగా మరో మలయాళ మూవీ తెలుగు ఆడియన్స్‌ను అలరించేందుకు వస్తోంది.మలయాళంలో తెరకెక్కించిన రొమాంటిక్ కామెడీ మూవీ లిటిల్ హార్ట్స్. ప్రస్తుతం ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో కేవలం మలయాళం భాషలోనే స్ట్రీమింగ్ అవుతోంది. తాజాగా ఈ సినిమా తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నెల 24 నుంచి ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ ఆహా స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని ఆహా ట్విటర్ వేదికగా పంచుకుంది. కాగా.. ఈ ఏడాది జూన్‌లో బాక్సాఫీస్ వద్ద సందడి చేసిన ఈ చిత్రంలో షేన్ నిగమ్, మహిమా నంబియార్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రాన్ని ఆంటో జోస్ పెరీరా, అబీ ట్రెసా పాల్ తెరకెక్కించారు.Don't miss the heartwarming journey of #littlehearts. Premieres October 24th on aha. pic.twitter.com/GRHtwgghY7— ahavideoin (@ahavideoIN) October 21, 2024 -
చిన్నారులకు ఉచితంగా గుండె ఆపరేషన్లు
లబ్బీపేట(విజయవాడతూర్పు): విజయవాడ ఆంధ్రా హార్ట్ అండ్ బ్రెయిన్ ఇనిస్టిట్యూట్‌లో ఈ నెల 23 నుంచి నిర్వహించిన ప్రత్యేక శిబిరంలో 14 మంది చిన్నారులకు ఉచితంగా గుండె శస్త్ర చికిత్సలు నిర్వహించారు. హీలింగ్ లిటిల్ హార్ట్స్, యూకే చారిటీ వారి సహకారంతో పది మంది ఇంగ్లాండ్ వైద్యుల బృందం క్లిష్టతరమైన గుండె సమస్యలు ఉన్న చిన్నారులకు నూరుశాతం విజయవంతంగా సర్జరీలు నిర్వహించినట్లు ఆంధ్రాహాస్పటల్స్ పిడియాట్రిక్ చీఫ్ డాక్టర్ పీవీ రామారావు చెప్పారు. ఈ సందర్భంగా శుక్రవారం ఆంధ్రా హార్ట్ అండ్ బ్రెయిన్ ఇనిస్టిట్యూట్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో డాక్టర్ పీవీ రామారావు మాట్లాడుతూ తమ హాస్పటల్స్‌లో 2015 డిసెంబరు నుంచి నిర్వహిస్తున్న ప్రత్యేక శిబిరాల ద్వారా ఇప్పటి వరకూ 300 మంది చిన్నారులకు విజయవంతంగా గుండె శస్త్ర చికిత్సలు ఉచితంగా నిర్వహించినట్లు తెలిపారు. ఈ శిబిరంలో అత్యంత క్లిష్టమైన గుండె సమస్యలకు విజయవంతంగా శస్త్ర చికిత్సలు నిర్వహించినట్లు రామారావు చెప్పారు. యూకే హాస్పటల్స్, లెస్టర్ రాయల్ ఇంపమరీ, గ్రేట్హార్మోన్ స్ట్రీట్ హాస్పటల్ లండన్, రాయల్ మాంచెస్టర్ చిల్డ్రన్స్ హాస్పటల్ వంటి ప్రముఖ హాస్పటల్స్ నుంచి వైద్యులు ప్రత్యేక శిబిరాల్లో పాల్గొని శస్త్ర చికిత్సలు నిర్వహించారన్నారు. సమావేశంలో యూకే వైద్యులు డాక్టర్ ఒప్పిడో గిడో, డాక్టర్ సెర్రావు ఆండ్రియా, కార్వే లైనుసయమారీ, స్కేర్పాటి క్యాటీలోసిదే, బీచార్డ్ ఎలిజెబెత్ జీన్, మేరీ క్యాథలీన్, గోపిశెట్టి షర్మిల, ఆంధ్రా హాస్పటల్ పీడియాట్రిక్ కార్డియాలజిస్ట్ డాక్టర్ విక్రమ్ కుడుములు, కార్డియాలజిస్ట్ డాక్టర్ జె.శ్రీమన్నారాయణ, కార్డియోథోరాసిక్ సర్జన్ డాక్టర్ దిలీప్ తదితరులు పాల్గొన్నారు. హీరో మహేష్‌బాబు అభినందనలు... నవ్యాంధ్రలో గుండెజబ్బులతో బాధపడుతున్న చిన్నారులకు ఉచితంగా శస్త్ర చికిత్సలు నిర్వహిస్తున్న ఆంధ్ర హాస్పటల్స్, యూకే వైద్యుల బృందాన్ని సినీహీరో మహేష్‌బాబు అభినందించారు. యూకే వైద్యులతోపాటు, శస్త్ర చికిత్సలు చేయించుకున్న చిన్నారులు, తల్లిదండ్రులు శుక్రవారం హోటల్ డీవీ మానర్‌లో మహేష్‌బాబును కలిశారు. మహేష్‌బాబు మట్లాడుతూ ఇంత మంది చిన్నారులకు నూరుశాతం సక్సెస్ రేటుతో సర్జరీలు నిర్వహించడం గొప్ప విషయమన్నారు. గుండెజబ్బులతో బాధపడుతున్న చిన్నారులకు సేవలు అందించే విషయంలో తమవంతు సహకారం అందిస్తానని పేర్కొన్నారు. -
స్కూలు బస్సుకు తప్పిన ప్రమాదం
చెరుకుపల్లి: బ్రేకులు ఫెయిల్ కావటంతో స్కూలు బస్సు బోల్తా పడింది. గుంటూరు జిల్లా చెరుకుపల్లి మండలం కామినేనివారిపాలెం వద్ద బుధవారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. చెరుకుపల్లి మండలకేంద్రంలోని లిటిల్‌హార్ట్స్ స్కూలుకు చెందిన బస్సు కామినేని వారి పాలెం వైపు నుంచి విద్యార్థులతో వస్తోంది. మార్గమధ్యంలో బ్రేకులు పనిచేయకపోవటంతో అదుపు తప్పి బస్సు బోల్తా పడింది. అదృష్టవశాత్తు విద్యార్థులంతా సురక్షితంగా బయటపడ్డారు.