
‘‘90స్ మిడిల్ క్లాస్ బయోపిక్’ ఫేమ్ మౌళి తనుజ్, శివానీ నాగారం జంటగా నటించిన చిత్రం ‘లిటిల్ హార్ట్స్’. సాయి మార్తాండ్ దర్శకత్వంలో ఆదిత్య హాసన్ నిర్మించిన ఈ చిత్రం నేడు (శుక్రవారం) విడుదలవుతోంది. ఈ సందర్భంగా గురువారం విలేకరుల సమావేశంలో మౌళి తనుజ్ మాట్లాడుతూ– ‘‘బీటెక్ పూర్తి చేశాను. ఎనిమిదో తరగతి చదువుతున్నప్పట్నుంచే బేసిక్ ఎడిటింగ్ నేర్చుకున్నాను. మొదట్లో రియాక్షన్ వీడియోస్ చేశాను. ఆ తర్వాత షార్ట్ ఫిల్మ్స్, మీమ్స్ చేశాను. నేను చదువుకుంటున్నప్పుడే నా ఖర్చులు నేనే చూసుకున్నాను.
రైటర్, డైరెక్టర్ అవుదామనే ఇండస్ట్రీకి వచ్చాను. అయితే ‘90స్ మిడిల్ క్లాస్ బయోపిక్’ సిరీస్‌తో నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాను. ‘లిటిల్ హార్ట్స్’ సినిమా కథ విన్నప్పుడు థియేట్రికల్‌గా బాగుంటుందనిపించింది. సోషల్ మీడియాలో విభిన్నమైన అభిప్రాయాలు ఉంటాయి. అయితే సరైన విమర్శలను తప్పక తీసుకుంటాను.
లోపాలు సరి చేసుకుంటేనే ఎదుగుతామని నా ఫీలింగ్. ‘లిటిల్ హార్ట్స్’ కేవలం యూత్ కోసమే కాదు... ఫ్యామిలీస్ అందరూ చూడదగ్గ చిత్రం. ఇక దర్శకుణ్ణి కావాలన్న నా కల నేరవేరుతుందా? లేదా అనేది తెలియదు. కానీ కథ ఉంది. ఈ కథలో నేనే హీరోగా నటించి, దర్శకత్వం వహిస్తాను’’ అని అన్నారు.