ఓటీటీకి వచ్చేస్తోన్న మలయాళ హిట్ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే? | Malayalam Movie Little Hearts Streaming On This Ott From This Date | Sakshi
Sakshi News home page

Little Hearts: ఓటీటీకి రొమాంటిక్‌ కామెడీ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

Oct 21 2024 5:29 PM | Updated on Oct 21 2024 6:30 PM

Malayalam Movie Little Hearts Streaming On This Ott From This Date

ఓటీటీల్లో మలయాళం సినిమాలకు క్రేజ్‌ ఓ రేంజ్‌లో ఉంటోంది. గతంలో వచ్చిన చాలా సినిమాలు ప్రేక్షకుల ఆదరణ దక్కించుకున్నాయి. మలయాళంలో సూపర్‌హిట్‌గా నిలిచిన చిత్రాలు తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. మంజుమ్మెల్ బాయ్స్, ప్రేమలు లాంటి టాలీవుడ్ ప్రియులను అలరించాయి. తాజాగా మరో మలయాళ మూవీ తెలుగు ఆడియన్స్‌ను అలరించేందుకు వస్తోంది.

మలయాళంలో తెరకెక్కించిన రొమాంటిక్‌ కామెడీ మూవీ లిటిల్‌ హార్ట్స్. ప్రస్తుతం ఈ సినిమా అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో కేవలం మలయాళం భాషలోనే స్ట్రీమింగ్‌ అవుతోంది. తాజాగా ఈ సినిమా తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నెల 24 నుంచి ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌ ఆహా స్ట్రీమింగ్‌ కానుంది. ఈ విషయాన్ని ఆహా ట్విటర్ వేదికగా పంచుకుంది. కాగా..  ఈ ఏడాది జూన్‌లో బాక్సాఫీస్ వద్ద సందడి చేసిన ఈ చిత్రంలో షేన్‌ నిగమ్‌, మహిమా నంబియార్‌ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రాన్ని ఆంటో జోస్‌ పెరీరా, అబీ ట్రెసా పాల్‌ తెరకెక్కించారు.

Advertisement
 
Advertisement
Advertisement