
టాలీవుడ్లో ఇటీవలే విడుదలైన చిన్న సినిమాపై ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రశంసలు కురిపించారు. లిటిల్ హార్ట్స్ తన మనసును దోచుకుందని ట్వీట్ చేశారు. చాలా సరదాగా నవ్వులు పూయించారని అల్లు అర్జున్ కొనియాడారు. ఈ యంగ్ లవ్ స్టోరీ చాలా కొత్తగా, వినోదంగా అనిపించిందని రాసుకొచ్చారు. ఈ సందర్భంగా లిటిల్ హార్ట్స్ చిత్ర బృందానికి తన అభినందనలు తెలియజేశారు ఐకాన్ స్టార్. డైరెక్టర్ సాయి మార్తాండ్ పనితీరు తనకు నచ్చిందని.. మ్యూజిక్ రిఫ్రెసింగ్గా అనిపించిందని పోస్ట్ చేశారు. ఈ ప్రత్యేక చిత్రాన్ని థియేటర్లకు తీసుకువచ్చినందుకు నిర్మాత బన్నీ వాసుకు ధన్యవాదాలు అంటూ ట్వీట్ చేశారు.
Watched #LittleHearts yesterday… What a funnn & laughter ride! No melodrama, no gyan… just full entertainment. A very fresh, young love story. A blast by the lead @mouli_talks, a sweet presence by @shivani_nagaram, and candid performances by friends & other artists. Loved the… pic.twitter.com/0ycrtuD4tg
— Allu Arjun (@alluarjun) September 11, 2025