
లిటిల్ హార్ట్స్ (Little Hearts)సినిమాతో నటుడు మౌళి(Mouli Tanuj ) భారీ క్రేజ్ తెచ్చుకున్నాడు. గతేడాదిలో ‘హ్యాష్‌ట్యాగ్ 90s’ అనే వెబ్ సిరీస్‌తో యూత్‌కు బాగా దగ్గరైన మౌళి తన టైమింగ్ డైలాగ్స్‌తో గుర్తింపు సంపాదించాడు. హీరోగా తొలి సినిమా ‘లిటిల్ హార్ట్స్’తో బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించాడు. ఇప్పుడు పెద్ద నిర్మాతలు కూడా తనతో ఒక సినిమా చేద్దాం అనుకునే రేంజ్‌కు చేరుకున్నాడు. కొత్త దర్శకులు కూడా ఇప్పటికే స్టోరీ చెప్పేందుకు రెడీ అవుతున్నారు. ఈ క్రమంలోనే ఒక భారీ నిర్మాణ సంస్థ నుంచి మౌళికి బిగ్ ఆఫర్ వచ్చినట్లు వార్తలు వస్తున్నాయి.
చిన్న సినిమాగా విడుదలైన లిటిల్ హార్ట్స్ బాక్సాఫీస్ వద్ద రూ. 40 కోట్లకు పైగానే కలెక్షన్స్ రాబట్టింది. ఓటీటీలో కూడా ఈ చిత్రం దూసుకుపోతుంది. దీంతో అతని మార్కెట్ కూడా పెరిగింది. ఇప్పుడు మౌళికి ఏకంగా మైత్రీ మూవీ మేకర్స్ నుంచి సినిమా ఆఫర్ ఇవ్వడమే కాకుండా అడ్వాన్స్ కూడా ఇచ్చేశారని తెలుస్తోంది. ఏకంగా రూ. కోటి రెమ్యునరేషన్ కూడా వారు ఇస్తామని చెప్పినట్లు సమాచారం. కేవలం రెండో సినిమాకే ఈ రేంజ్ రెమ్యునరేషన్ ఇస్తామని చెప్పడం పెద్ద విషయమేనని చెప్పాలి.
ఒక సినిమా హిట్ అయినప్పటికీ మరో ఛాన్స్ రావడం కష్టంగా ఉన్న ఈరోజుల్లో ఒక పెద్ద నిర్మాణ సంస్థ తన వద్దకే వచ్చి ఇలా ఆఫర్ ఇవ్వడం అంటే సాధారణ విషయం కాదు. దీనంతటికీ కారణం మౌళికి యూత్‌తో బాగా కనెక్ట్ ఉంది. సోషల్‌మీడియాలో భారీ ఇమేజ్ ఉంది. అందుకే తనకు మైత్రీ మూవీస్ సినిమా అవకాశం ఇచ్చినట్లు టాక్. ఈ సినిమా గురించి మరిన్ని వివరాలు త్వరలో రావచ్చు.