
శివానీ నాగరం, మౌళి తనుజ్
‘90స్ మిడిల్ క్లాస్ బయోపిక్’ ఫేమ్ మౌళి తనుజ్, శివానీ నాగరం లీడ్ రోల్స్‌లో నటించిన లవ్‌స్టోరీ ‘లిటిల్ హార్ట్స్’. ఈటీవీ విన్ ఒరిజినల్ ప్రోడక్షన్ పతాకంపై సాయి మార్తాండ్ దర్శకత్వంలో ఆదిత్య హాసన్ నిర్మించిన ఈ చిత్రం సెప్టెంబరు 5న థియేటర్స్‌లో విడుదల కానుంది. నిర్మాతలు బన్నీ వాసు, వంశీ నంది పాటి ఈ సినిమాను థియేటర్స్‌లో రిలీజ్ చేస్తున్నారు. శనివారం ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేశారు మేకర్స్.
ఈ చిత్రంలో అఖిల్ పాత్రలో మౌళి, కాత్యాయనిగా శివాని నటించారు. ‘‘మన హీరో సైనిక్‌పురిలో చదువు రానివాడు’, ‘మన హీరోయిన్ వాయుపురిలో చదువురానిది’, ‘ఈ చదువు రాని ఇద్దరు చదువు ఎగ్గొట్టి మరీ లవ్ చేసుకుంటారు’, ‘ఈ చదువు రాని పిల్లల హృదయాల మధ్య జరిగే సంఘర్షణే ఈ కథ’, ‘హిట్టవుతదరా... ఈ సినిమా’, ‘నాకు డౌటే...’, ‘పక్కా హిట్టే... ఆస్కార్ వస్తది చూడు..’ వంటి డైలాగ్స్ ఈ సినిమా ట్రైలర్‌లో ఉన్నాయి.