
సినిమా ఇండస్ట్రీ అనేది చూడటానికి బాగానే ఉంటుంది గానీ లోపల చాలా సంగతులు జరుగుతుంటాయి. అవన్నీ సామాన్య ప్రేక్షకుడికి తెలిసేది తక్కువే. ఎప్పుడో ఎవరో ఒకరు బయటకు చెబితే అలాంటివి వైరల్ అవుతుంటాయి. తాజాగా నటుడు-నిర్మాత బండ్ల గణేశ్ అలాంటి వాటి గురించి మాట్లాడారు. షాకింగ్ కామెంట్స్ చేశారు. 'లిటిల్ హార్ట్స్' సక్సెస్ మీట్ గురువారం సాయంత్రం జరగ్గా.. ఇందులో హీరో మౌళిని ఉద్దేశిస్తూ మాట్లాడిన మాటలు ఇప్పుడు తెగ వైరల్ అవుతున్నాయి.
'ఈ 20 రోజులు జరిగింతా అబద్ధం, ఓ కల్పన. కళ్లజోడు తీసేయ్. ఈ సినిమా రిలీజ్‌కి ముందు ఎలా అయితే ఉన్నావో అలానే ఉండు. ఎవరేం చెప్పినా నమ్మకు. నువ్వు ఓ చంద్రమోహన్‌లా ఇండస్ట్రీని ఏలాలని కోరుకుంటున్నాను. ఈ ఫిల్మ్ నగర్, ఈ సినిమా, ఈ ట్వీట్స్, ఈ పొగడ్తలు ఇదంతా అబద్ధం. ఇంటికెళ్లిన తర్వాత వాస్తవానికి వెళ్లిపో.. లేదంటే ఈ మాఫియా మనల్ని బతకనివ్వదు. ఈ మాఫియాకు దూరంగా ఉండాలంటే మన బేస్ మీదే ఉండాలి. ఎవడు బాగుంటే.. అబ్బబ్బా ఎంత పొడుగుందో అని అంటారు. అవన్నీ నమ్మకు'
(ఇదీ చదవండి: సగం వయసున్న వాళ్లతో డేటింగ్.. నేను కూడా రెడీ: హీరోయిన్ అమీషా పటేల్)
'రౌడీ టీ షర్ట్ ఇచ్చాడు. మహేశ్ బాబు ట్వీట్ వేశాడు. బండ్ల గణేశ్ అవి వేశాడు. ఇవన్నీ అబద్ధాలు. నిన్ను ఆశీర్వదించడానికి, నీకు విషెస్ చెప్పడానికి అలా చేస్తారు. ఇంకో ఫ్రైడే ఇంకో మౌళి వస్తాడు. ప్రతిదానికి సిద్ధమై ఉండు. ఎప్పుడూ జాగ్రత్తగా ఉండు. దయచేసి దురలవాట్లు చేసుకోకు. ఎవరినీ నమ్మకు. నమ్మినట్లు ఉండు. వాస్తవంగా బతుకు. అద్భుతంగా సినిమాలు చేసుకో. నటుడిగా పేరు తెచ్చుకో. మీ అమ్మనాన్న తలెత్తుకునే విధంగా, ఇండస్ట్రీ అంతా నిన్ను చూసి ఆనందపడేలా మనస్పూర్తిగా ఉండాలని కోరుకుంటున్నాను' అని బండ్ల గణేశ్ చెప్పుకొచ్చాడు.
బండ్ల గణేశ్ చెప్పిన వాటిలో పచ్చి నిజాలు బోలెడన్ని ఉన్నాయి. కానీ ఆయన ఇలా డైరెక్ట్‌గా చెప్పేసరికి అందరూ షాకయ్యారు. 'లిటిల్ హార్ట్స్' విషయానికొస్తే.. మౌళి, శివాని హీరోహీరోయిన్లుగా నటించగా సాయి మార్తాండ్ అనే కుర్రాడు దర్శకుడిగా పరిచయమయ్యాడు. రెండున్నర కోట్లతో మూవీ తీస్తే రూ.50 కోట్ల వరకు కలెక్షన్స్ అందుకుంది.
(ఇదీ చదవండి: హీరో శర్వానంద్ దంపతులు విడిపోయారా?)
"ఈ మాఫియా నిన్ను బతకనివ్వదు..."
A life lesson by #BandlaGanesh 👏
Only he has the guts to speak facts like this. pic.twitter.com/kMqCTPciXG— Movies4u Official (@Movies4u_Officl) September 18, 2025