అల్లు అరవింద్‌ ఏమీ చేయరు, చివర్లో వచ్చి పేరు కొట్టేస్తారు! | Bandla Ganesh Comments on Allu Aravind at Little Hearts Movie Success Meet | Sakshi
Sakshi News home page

Bandla Ganesh: మీరెంత కష్టపడ్డా చివరకు అల్లు అరవింద్‌ సినిమా అంటారు, అది మీ బ్యాడ్‌లక్‌!

Sep 19 2025 10:35 AM | Updated on Sep 19 2025 11:08 AM

Bandla Ganesh Comments on Allu Aravind at Little Hearts Movie Success Meet

యూట్యూబర్‌ మౌళి కథానాయకుడిగా నటించిన చిత్రం లిటిల్‌ హార్ట్స్‌ (Little Hearts Movie). సాయి మార్తాండ్‌ దర్శకత్వం వహించగా ఆదిత్య హాసన్‌ నిర్మించారు. ఈ మూవీని బన్నీ వాస్‌, వంశీ నందిపాటి సెప్టెంబర్‌ 5న రిలీజ్‌ చేశారు. కేవలం రెండున్నర కోట్లతో తెరకెక్కిన ఈ మూవీ బాక్సాఫీస్‌ దాదాపు రూ.40 కోట్లు వసూలు చేసింది. దీంతో చిత్రయూనిట్‌ సెలబ్రేషన్‌ ఆఫ్‌ గ్లోరీ పేరిట సక్సెస్‌ మీట్‌ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి విజయ్‌ దేవరకొండ, బండ్ల గణేశ్‌ ముఖ్య అతిథులుగా విచ్చేశారు.

కోట్లల్లో ఒకరు
ఈ కార్యక్రమంలో బండ్ల గణేశ్‌ (Bandla Ganesh) మాట్లాడుతూ.. సినిమా అంటేనే కష్టాలు, కన్నీళ్లు, బాధలు. అన్నీ ప్రిపేర్‌ అయి రావాలి. కానీ, వందల కోట్లలో ఒకాయన మాత్రం దీనికి అతీతులుగా ఉన్నారు. ఆయన (అల్లు అరవింద్‌ను ఉద్దేశిస్తూ) స్టార్‌ కమెడియన్‌కు కొడుకుగా పుడతాడు, మెగాస్టార్‌కు బామ్మర్దిగా, ఐకాన్‌ స్టార్‌కు తండ్రిగా ఉంటాడు. ఎప్పుడూ కాలు మీద కాలేసుకుంటాడు. ఆయనెవరికీ అందుబాటులో ఉండడు. ఆయన కావాలనుకున్న వారికి మాత్రమే అందుబాటులో ఉంటాడు. 

సిగ్గుతో తలదించుకోవాలి
అదీ జీవితం అంటే! అలాంటి మహర్జాతకుడిని నేను జీవితంలో చూడలేదు, ఇక చూడబోను కూడా! అలా జీవితాన్ని అద్భుతంగా ప్లాన్‌ చేసుకున్న అరవింద్‌గారు ఇక్కడికి రావడం సంతోషం. చిన్న సినిమా చచ్చిపోయింది అనుకుంటున్న తరుణంలో బడ్జెట్‌తో కాదు, కథతో మూవీ తీస్తే హిట్టవుతుందని నిరూపించింది లిటిల్‌ హార్ట్స్‌. రెండున్నర కోట్లతో రూ.50 కోట్లు కలెక్ట్‌ చేసే సినిమా తీశారంటే మెచ్చుకుని తీరాల్సిందే! మిమ్మల్ని చూసి నేను సహా పెద్దపెద్ద దర్శకనిర్మాతలు సిగ్గుతో తలదించుకునేలా చేశారు. ఈ మూవీని జనానికి చేరువ చేసిన బన్నీ వాసు, వంశీని అభినందించాలి. 

ఆయన పేరు కొట్టేస్తారు
మీరెంత కష్టపడ్డా చివరికి అల్లు అరవింద్‌ (Allu Aravind)గారి సినిమా అంటున్నారు. అది ఆయన అదృష్టం, మీ దురదృష్టం. నేనేం చెప్పలేను. ఆయనేమీ చేయరు. చివరి నిమిషంలో వస్తారు, పేరు కొట్టేస్తారు. ఆయన జాతకం అలాంటిది, దానికి మనమేమీ చేయలేం అన్నాడు. ఈ కామెంట్స్‌తో అక్కడున్నవాళ్లు షాకయ్యారు. దీంతో బన్నీ వాసు స్పందిస్తూ.. అల్లు అరవింద్‌గారు పుట్టాకే అల్లు రామలింగయ్యగారు స్టార్‌ కమెడియన్‌ అయ్యారు. ఆ విషయం బండ్లన్నకు తెలియదేమో! మా అందరికీ అరవింద్‌గారే ఆదర్శం అని పేర్కొన్నాడు.

ఆయన మాకెంతో ఇష్టం
ఇక బండ్ల కామెంట్స్‌పై నెట్టింట ట్రోలింగ్‌ జరుగుతుండటంతో సోషల్‌ మీడియా వేదికగా బండ్ల గణేశ్‌ ఓ పోస్ట్‌ పెట్టాడు. అల్లు అరవింద్‌గారు మాటల్లో చెప్పలేనంత గొప్ప నిర్మాత. ఆయన నిర్మించిన సినిమాలు ఎప్పటికీ గుర్తుండిపోయే బ్లాక్‌బస్టర్స్‌. ఆయన దూరదృష్టి, కృషి, సినిమా మీదున్న ప్రేమ వల్ల తెలుగు సినిమా గర్వంగా నిలబడింది. అల్లు అరవింద్‌గారంటే మాకెంతో ఇష్టం అని ట్వీట్‌ చేశాడు.

చదవండి: లిటిల్‌ హార్ట్స్‌.. మరీ అంత బాగోలేదు: యాటిట్యూడ్‌ స్టార్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement