
ప్రముఖ నటుడు ప్రభాకర్ తనయుడు, హీరో ఆటిట్యూడ్ స్టార్ చంద్రహాస్ (Chandrahas) కొత్త మూవీ చేస్తున్నాడు. అదే కాయిన్. తన బర్త్‌డే (సెప్టెంబర్ 17) సందర్భంగా కాయిన్ టైటిల్ పోస్టర్‌తో పాటు, గ్లింప్స్ వీడియో సైతం రిలీజ్ చేశారు. జైరామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీని శ్రీకాంత్ రాజా రత్నం నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఈవెంట్‌లో చంద్రహాస్ పలు ప్రశ్నలకు సమాధానాలిచ్చాడు. ఈ మధ్యకాలంలో వచ్చిన సినిమాల్లో ఏది బాగుందన్న ప్రశ్నకు చంద్రహాస్ ఇలా స్పందించాడు.
ఎంజాయ్ చేశా.. కానీ!
లిటిల్ హార్ట్స్ కామెడీ ఎంటర్‌టైనర్. కామెడీ సినిమాలు అప్పటికప్పుడు చూసి నవ్వుకుని వదిలేస్తాను. ఆ మూవీ చాలా బాగుందనైతే నేను చెప్పలేను. కాకపోతే ఎంజాయ్ చేశానంతే! అని చెప్పుకొచ్చాడు. రామ్‌నగర్ బన్నీ సినిమా నష్టాల గురించి స్పందిస్తూ.. మేము పెట్టినదాంట్లో సగానికంటే ఎక్కువ తిరిగొచ్చింది. కానీ ఆస్తులమ్ముకున్నాం, నష్టాల్లో కూరుకుపోయాం అన్న వార్తల్లో నిజం లేదు అని చంద్రహాస్ క్లారిటీ ఇచ్చాడు.