
‘100% లవ్’ సినిమాలో బొద్దుగా ఉండే ఓ బుడ్డొడు గుర్తున్నాడా..? చదువు.. చదువు అంటూ బాలు(నాగచైతన్య) పెట్టే టార్చర్ భరించలేక మహాలక్ష్మీ(తమన్నా)తో చేతులు కలుపుతాడు. మహాలక్ష్మీకి ఫస్ట్ ర్యాంక్ వచ్చిన తర్వాత బాలు ముద్దే చికెన్ తింటూ..‘ఎవడ్రా చికెన్ తింటే బ్రెయిన్ పని చేయదని చెప్పింది?’ అంటూ నాగచైతన్యపై సెటైర్లు వేసి అందరిని కడుపుబ్బా నవ్వించాడు. ఆ బుడ్డొడు ఇప్పుడు చాలా పెద్దవాడైపోయాడు. గడ్డం, మీసాలు పెంచి హీరోలా మారిపోయాడు. అతని పేరు నిఖిల్ అబ్బూరి.
#90s సిరీస్ ఫేమ్ మౌళి హీరోగా తెరకెక్కుతున్న లిటిల్ హార్ట్స్ సినిమాలో కీలక పాత్ర పోషించాడు. తాజాగా ఈ చిత్రం టీజర్ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో హీరో మౌళి.. నిఖిల్‌ని పరిచయం చేశాడు. 100% సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా చేశాడంటూ మౌళి చెప్పేవరకు ఆ బుడ్డోడే ఈ నిఖిల్ అని ఎవరూ గుర్తుపట్టలేదు. ఆ సినిమా నిర్మాత బన్నీవాసు సైతం నిఖిల్‌ని గుర్తుపట్టలేకపోయాడు. అంతలా మారిపోయాడు మనోడు. టీజర్ ఈవెంట్‌కి గెస్ట్‌గా వచ్చిన అనిల్ రావిపూడి సైతం నిఖిల్‌ని చూసి ఆశ్చర్యపోయాడు. ‘100% లవ్ సినిమాలో చికెన్ తిన్నది నువ్వేనా? గుర్తుపట్టలేకపోయాను నాన్న.. ’ అంటూ నిఖిల్‌ని స్టేజ్‌పైకి పిలిచి అభినందించాడు.
ప్రభాస్ ‘మిర్చి’, రామ్ ‘గణేశ్’తో పాటు పలు సినిమాల్లోనూ చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించిన నిఖిల్..ఇప్పుడు హీరోగా ట్రై చేస్తున్నాడు. లిటిల్ హార్ట్స్ సినిమాలో హీరో ఫ్రెండ్ పాత్రని పోషించాడు. ఈ చిత్రం ఆగస్ట్ 12న ప్రేక్షకుల ముందుకు రానుంది.
#100%Love లో చికెన్ తిన్నది నువ్వేనా? గుర్తుపట్టలేదు నాన్న నిన్ను.... pic.twitter.com/AzUhCTxHCh
— Rajesh Manne (@rajeshmanne1) August 19, 2025