స్కూలు బస్సుకు తప్పిన ప్రమాదం | school bus accident in guntur distirict | Sakshi
Sakshi News home page

స్కూలు బస్సుకు తప్పిన ప్రమాదం

Mar 30 2016 9:44 AM | Updated on Apr 3 2019 7:53 PM

బ్రేకులు ఫెయిల్ కావటంతో స్కూలు బస్సు బోల్తా పడింది. గుంటూరు జిల్లా చెరుకుపల్లి మండలం కామినేనివారిపాలెం వద్ద బుధవారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది.

చెరుకుపల్లి: బ్రేకులు ఫెయిల్ కావటంతో స్కూలు బస్సు బోల్తా పడింది. గుంటూరు జిల్లా చెరుకుపల్లి మండలం కామినేనివారిపాలెం వద్ద బుధవారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. చెరుకుపల్లి మండలకేంద్రంలోని లిటిల్‌హార్ట్స్ స్కూలుకు చెందిన బస్సు కామినేని వారి పాలెం వైపు నుంచి విద్యార్థులతో వస్తోంది. మార్గమధ్యంలో బ్రేకులు పనిచేయకపోవటంతో అదుపు తప్పి బస్సు బోల్తా పడింది. అదృష్టవశాత్తు విద్యార్థులంతా సురక్షితంగా బయటపడ్డారు.

Advertisement
 
Advertisement
Advertisement