‘లిటిల్‌ హార్ట్స్‌’ మూవీ రివ్యూ | Little Hearts Movie Review And Rating In Telugu | Sakshi
Sakshi News home page

‘లిటిల్‌ హార్ట్స్‌’ మూవీ రివ్యూ

Sep 5 2025 4:47 PM | Updated on Sep 5 2025 6:22 PM

Little Hearts Movie Review And Rating In Telugu

టైటిల్‌: లిటిల్హార్ట్స్
నటీనటులు: మౌళి తనూజ్, శివానీ నాగరం, రాజీవ్ కనకాల, ఎస్ ఎస్ కాంచి, అనిత చౌదరి, సత్య కృష్ణన్, తదితరులు
రచన, దర్శకత్వం : సాయి మార్తండ్
నిర్మాత: ఆదిత్య హాసన్
సంగీతం: సింజిత్ యెర్రమల్లి
సినిమాటోగ్రఫీ : సూర్య బాలాజీ
విడుదల తేది: సెప్టెంబర్‌ 5, 2025

‘90s మిడిల్ క్లాస్ బయోపిక్’ ఫేమ్ మౌళి తనుజ్, ‘అంబాజీపేట మ్యారేజి బ్యాండు’ఫేమ్‌ హీరోయిన్ శివానీ నాగరం జంటగా నటించిన తాజా చిత్రం ‘లిటిల్‌ హార్ట్స్‌’. సాయి మార్తాండ్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ట్రైలర్‌తో ప్రేక్షకుల్లో మంచి బజ్‌ని క్రియేట్‌ చేసుకుంది. దానికి తోడు ప్రమోషన్స్కూడా గట్టిగా చేయడంతో చిన్న సినిమాపై మోస్తరు అంచనాలు కూడా ఏర్పడ్డాయి. మరి అంచనాలను చిత్రం అందుకుందా? లేదా రివ్యూలో చూద్దాం.

కథేంటంటే..?
సినిమా కథ 2009-2020 మధ్య కాలంలో సాగుతుంది. నల్లి అఖిల్‌(మౌళి తనూజ్‌) చదువులో చాలా వీక్‌. అతన్ని ఇంజనీర్చేయాలానేది తండ్రి గోపాలరావు(రాజీవ్కనకాల)ఆశయం. కానీ అఖిల్ఎంసెట్లో క్వాలిఫై కూడా కాడు. తనవల్ల కాదని చెప్పినా వినకుండా లాంగ్టర్మ్కోచింగ్కి పంపిస్తాడు తండ్రి. కోచింగ్సెంటర్లో ఉన్న కాత్యాయని(శివానీ నాగారం) పరిస్థితి కూడా అంతే. ఆమెకు మెడిసిన్చదవడం ఇష్టం ఉండదు. కానీ పెరెంట్స్బలవంతంగా లాంగ్టర్మ్కోచింగ్కి పంపిస్తారు. అక్కడే అఖిల్కి కాత్యాయని పరిచయం అవుతుంది. అది కాస్త ప్రేమకు దారి తీస్తుంది.  అఖిల్‌ తన ప్రేమ విషయాన్ని బయట పెట్టగానే.. కాత్యాయని ఓ సీక్రెట్‌ విషయాన్ని వెల్లడిస్తుంది. అదేంటి? అఖిల్‌, కాత్యాయనిల ప్రేమకు ఎదురైన సమస్యలు ఏంటి? వాటిని వీరిద్దరు ఎలా ఎదుర్కొని..ఒకటయ్యారు? అనేదే ఈ సినిమా కథ. 

ఎలా ఉందంటే.. 
కొన్ని సినిమాల కథలు చాలా సింపుల్‌గా, రొటీన్‌గా ఉన్నా..  తెరపై చూస్తుంటే బోర్‌ కొట్టదు.  ఊహించే మలుపు ఉన్నా.. ఎక్కడో చూసిన సన్నివేశాలు కనిపించినా.. ఎంటర్‌టైన్‌ అవుతుంటాం. లిటిల్‌ హార్ట్స్‌ ఆ కోవలోకి చెందిన చిత్రమే.  కథగా చెప్పాలంటే ఇందులో కొత్తదనం ఏమి ఉండదు. రెగ్యులర్‌ రొటీజ్‌ టీనేజ్‌ లవ్‌స్టోరీ. కానీ దర్శకుడు రాసుకున్న సన్నివేశాలు.. పంచ్‌ డైలాగులు సినిమాను నిలబెట్టాయి. ప్రారంభం నుంచి ముగింపు వరకు ఆద్యంతం వినోదాత్మకంగా సాగే చిత్రమిది.  టీనేజ్‌ అమ్మాయి/అబ్బాయిలు బాగా ఎంజాయ్‌ చేస్తారు. ముఖ్యంగా 2009-2020 మధ్య కాలేజీ చదివిన వాళ్లు ఈ కథకు బాగా కనెక్ట్‌ అవుతారు. 

జియో సిమ్‌ రాకముందు అంటూ హీరోహీరోయిన్లు, వాళ్ల ఫ్యామిలీ నేపథ్యాన్ని పరిచయం చేస్తూ కథను ప్రారంభించారు. కోచింగ్‌ సెంటర్‌లో హీరోహీరోయిన‍్ల పరిచయం తర్వాత కథనం మరింత ఎంటర్‌టైనింగ్‌గా సాగుతుంది. కాత్యాయని ఇంప్రెస్‌ చేసేందుకు అఖిల్‌ చేసే ప్రయత్నాలు.. ఈ క్రమంలో స్నేహితుడు వేసే పంచులు నవ్వులు పూయిస్తాయి. ఇంటర్వెల్‌కి ముందు వచ్చే ట్విస్ట్‌ అదిరిపోతుంది. ఇక సెకండాఫ్‌లో కామెడీ డబుల్‌ అవుతుంది. హీరోయిన్‌కి దగ్గరయ్యేందుకు హీరో చేసే ప్రయత్నాలు.. ఆమె బర్త్‌డే కోసం అఖిల్‌ చేసే సర్‌ప్రైజ్‌.. అవి ఇంట్లో వాళ్లకు తెలిసిన తర్వాత ఎదురయ్యే చిక్కులు.. ఇవన్నీ నవ్వులు పూయిస్తాయి. 

అయితే హీరోహీరోయిన్లు కలిసేందుకు చిన్న పిల్లలను వాడుకోవడం.. వారి మధ్య వచ్చే సన్నివేశాలు కాస్త ఎబ్బెట్టుగా అనిపిస్తాయి. అలాగే ఒకటి రెండు చోట్ల డైలాగులు ఫ్యామిలీ ఆడియన్స్‌ని ఇబ్బందికి గురి చేస్తాయి. అయితే ప్రస్తుతం వస్తున్న యూత్‌ఫుల్‌ కామెడీ చిత్రాలతో పోలిస్తే.. ఇందులో వల్గారిటీ చాలా తక్కువనే చెప్పాలి. బూతు సన్నివేశాలేవి లేకుండానే కామెడీ పండించారు. ఈ విషయంలో దర్శకుడిని మెచ్చుకోవాల్సిందే. ‘గోల్స్‌ ఎప్పుడు అందంగా ఉండాలి’ అంటూ హీరోతో ఒక డైలాగ్‌ చెప్పించడమే కాకుండా.. క్లైమాక్స్‌లో దాని రిజల్ట్‌ ఎలా ఉంటుందో కూడా చూపించారు.  యూత్‌ అయితే ఈ సినిమాను బాగా ఎంజాయ్‌ చేస్తారు. 

ఎవరెలా చేశారంటే.. 
అఖిల్‌ పాత్రలో మౌళి పర్వాలేదనిపించాడు. ఆయన కామెడీ టైమింగ్‌ బాగుంది. కాత్యాయ‌ని పాత్ర‌కి శివానీ నాగారం న్యాయం చేసింది. మౌళికి జోడీగా ఆమెను ఎందుకు తీసుకున్నారనేది సినిమా చూస్తే అర్థమవుతుంది. హీరో స్నేహిడు మధుగా జ‌య‌కృష్ణ పండించిన కామెడీ ఈ సినిమాకు మరో ప్రధాన బలమైంది. మ‌రో స్నేహితుడిగా నిఖిల్ కూడా తన పాత్ర పరిధిమేర చక్కగానే చేశారు. రాజీవ్ క‌న‌కాల‌, అనిత చౌద‌రి తదితరులు తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు. సాంకేతికంగా సినిమా బాగుంది.

Rating:
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement