
ఈ వీకెండ్ థియేటర్లలోకి మూడు సినిమాలొచ్చాయి. వీటిలో అనుష్క 'ఘాటీ', శివకార్తికేయన్ 'మదరాసి', లిటిల్ హార్ట్స్ అనే చిన్న చిత్రం ఉన్నాయి. అయితే అనుహ్యంగా అనుష్క మూవీకి తొలి ఆట నుంచే నెగిటివ్ టాక్ వచ్చింది. మరోవైపు మదరాసి చిత్రానికి యావరేజ్ టాక్ వచ్చింది. ఎలాంటి అంచనాల్లేకుండా వచ్చిన లిటిల్ హార్ట్స్ సినిమాకు మాత్రం పాజిటివ్ టాక్ వచ్చింది. మరి తొలిరోజు వసూళ్లు ఏ చిత్రానికి ఎంతొచ్చాయ్?
(ఇదీ చదవండి: అనుష్క శెట్టి ‘ఘాటి’ మూవీ రివ్యూ)
తొలుత ఘాటీ విషయానికొస్తే.. చాన్నాళ్ల తర్వాత అనుష్క లీడ్ రోల్‌లో ఈ మూవీ చేసింది. తూర్పు కనుమల్లో గంజాయి బ్యాక్ డ్రాప్ స్టోరీతో దీన్ని తెరకెక్కించారు. రిలీజ్‌కి ముందు వరకు బాగానే హైప్ ఏర్పడింది. కానీ కంటెంట్ మరీ పేలవంగా ఉందనే టాక్ రావడం దీనికి మైనస్ అయిందని చెప్పొచ్చు. అనుష్క తప్పితే పెద్దగా స్టార్ కాస్ట్ లేకపోవడం జనాల్ని థియేటర్లలోకి రప్పించలేకపోయింది. దీంతో తొలిరోజు దేశవ్యాప్తంగా రూ.2.89 కోట్ల కలెక్షన్ రాగా.. ప్రపంచవ్యాప్తంగా రూ.4.28 కోట్ల గ్రాస్ వచ్చినట్లు తెలుస్తోంది.
మరోవైపు ఏఆర్ మురుగదాస్-శివకార్తికేయన్ కలిసి చేసిన 'మదరాసి'పై ఎవరికీ పెద్దగా అంచనాల్లేవు. ఎందుకంటే ఈ దర్శకుడు హిట్ కొట్టి చాలా కాలమైపోయింది. కాస్తోకూస్తో హైప్ హీరో వల్ల ఏర్పడింది. దానికి తోడు తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ కావడం దీనికి ప్లస్ అయింది. దీంతో మొదటిరోజు 'మదరాసి' చిత్రానికి రూ.13 కోట్ల మేర గ్రాస్ కలెక్షన్ వచ్చినట్లు తెలుస్తోంది.
(ఇదీ చదవండి: శివకార్తికేయన్ 'మదరాసి' సినిమా రివ్యూ)
మరోవైపు మౌళి అనే యూట్యూబర్ లీడ్ రోల్ చేసిన సినిమా 'లిటిల్ హార్ట్స్'. టీనేజ్ లవ్ బ్యాక్ డ్రాప్ స్టోరీతో తీసిన ఈ చిత్రానికి రెండు రోజుల ముందే ప్రీమియర్లు కూడా వేశారు. అక్కడి నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం.. తొలిరోజు రూ.1.32 కోట్ల నెట్ వసూళ్లు సాధించినట్లు సమాచారం. అలానే రీసెంట్ టైంలో మొదటిరోజే బ్రేక్ ఈవెన్ అయిన సినిమాగానూ ఇది నిలిచినట్లు తెలుస్తోంది. వీకెండ్ పూర్తయితే ఎవరి జాతకం ఏంటనేది పూర్తిగా తేలుతుంది.
(ఇదీ చదవండి: ‘లిటిల్ హార్ట్స్’ మూవీ రివ్యూ)