
మరోవారం వచ్చేసింది. గత వీకెండ్ చిన్న సినిమాలే థియేటర్లలోకి వచ్చాయి. వాటిలో డబ్బింగ్ చిత్రం 'కొత్త లోక'.. ఉన్నంతలో పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. మిగిలినవి తేలిపోయాయి. మరోవైపు ఈసారి అనుష్క శెట్టి చాన్నాళ్ల తర్వాత లీడ్ రోల్ చేసిన 'ఘాటీ' విడుదలకు సిద్దమైంది. దీనికి పోటీగా తమిళ డబ్బింగ్ మూవీ 'మదరాశి' రాబోతుంది. దీనిపై పెద్దగా అంచనాలు లేవు. ఎందుకంటే హీరో శివకార్తికేయన్ అయినాసరే దర్శకుడు ఏఆర్ మురుగదాస్ కావడమే దీనికి కారణం. ఇది కాకుండా 'లిటిల్ హార్ట్స్' ఓ తెలుగు మూవీ కూడా విడుదల కానుంది.
(ఇదీ చదవండి: దీనస్థితిలో 'కేజీఎఫ్' నటుడు.. సాయం చేయాలని వేడుకోలు)

మరోవైపు ఓటీటీల్లోనూ మరీ ఎక్కువ సినిమాలేం రావట్లేదు. 10కి పైగా స్ట్రీమింగ్ కాబోతున్నాయి. వీటిలో ఇన్‌స్పెక్టర్ జెండే, ద ఫాల్ గాయ్ చిత్రాలు ఉన్నంతలో కాస్త ఆసక్తి కలిగిస్తున్నాయి. వీటితో పాటు వీకెండ్ అయ్యేసరికి కొత్త చిత్రాలు సడన్ సర్‌ప్రైజ్ ఇవ్వొచ్చు. ఇంతకీ ఏ మూవీ ఏ ఓటీటీలోకి రానుందంటే?
ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే మూవీస్ (సెప్టెంబరు 1 నుంచి 7వ తేదీ వరకు)
నెట్‌ఫ్లిక్స్
ద ఫాల్ గాయ్ (తెలుగు డబ్బింగ్ సినిమా) - సెప్టెంబరు 03
ఇన్‌స్పెక్టప్ జెండే (హిందీ మూవీ) - సెప్టెంబరు 05
హాట్‌స్టార్
ట్రేడ్ అప్ (హిందీ రియాలిటీ షో) - సెప్టెంబరు 01
లిలో అండ్ స్టిచ్ (ఇంగ్లీష్ సినిమా) - సెప్టెంబరు 03
అమెజాన్ ప్రైమ్
- ఔట్ హౌస్ (హిందీ సినిమా) - సెప్టెంబరు 01
సన్ నెక్స్ట్
సరెండర్ (తమిళ మూవీ) - సెప్టెంబరు 04
ఫుటేజ్ (మలయాళ సినిమా) - సెప్టెంబరు 05
జీ5
అంఖోన్ కీ గుస్తాకియాన్ (హిందీ మూవీ) - సెప్టెంబరు 05
కమ్మట్టం (మలయాళ సిరీస్) - సెప్టెంబరు 05
ఆపిల్ ప్లస్ టీవీ
హైయస్ట్ టూ లోయెస్ట్ (ఇంగ్లీష్ సినిమా) - సెప్టెంబరు 05
ఎమ్ఎక్స్ ప్లేయర్
రైజ్ అండ్ ఫాల్ (హిందీ సిరీస్) - సెప్టెంబరు 06
(ఇదీ చదవండి: 'జెర్సీ' వదులుకున్నా.. ఇప్పటికీ బాధపడుతున్నా: జగపతి బాబు)