
ఎంత పెద్ద స్టార్స్ అయినా సరే కొన్నిసార్లు అనుకున్నది జరగదు. అయితే సదరు నటీనటులు ఆ విషయాన్ని ఎప్పుడో ఓ సందర్భంలో బయటపెడుతుంటారు. దీంతో అది కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు కూడా అలానే సీనియర్ నటుడు జగపతి బాబు చెప్పిన సంగతి ఆసక్తికరంగా అనిపిస్తుంది. 'జెర్సీ' సినిమా ఫ్లాప్ అవుతుందనుకున్నాని.. కానీ హిట్ అవడంతో తాను ఆశ్చర్యపోయానని చెప్పుకొచ్చారు.
అప్పట్లో హీరోగా చాలా సినిమాలు చేసిన జగపతిబాబు.. 'లెజెండ్' మూవీతో క్యారెక్టర్ ఆర్టిస్టుగా రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టారు. ప్రస్తుతం అలా పలు భాషల్లో బిజీగా ఉన్నారు. రీసెంట్‌గానే టాక్ షో హోస్ట్‌గా మూడో ఇన్నింగ్స్ షురూ చేశారు. 'జయమ్ము నిశ్చయమ్మురా' పేరుతో ఈ కార్యక్రమం చేస్తున్నారు. మూడు వారాల క్రితమే ప్రారంభమైన ఈ షోకు ఇప్పటికే నాగార్జున, శ్రీలీల వచ్చారు. తమ గురించి పలు సంగతులు చెప్పారు. తాజా ఎపిసోడ్‌కి నాని చీఫ్ గెస్ట్. ఇతడితో మాట్లాడుతూ 'జెర్సీ' విషయంలో తనకెదురైన అనుభవాన్ని జగపతి బాబు పంచుకున్నారు.
(ఇదీ చదవండి: ఐదేళ్ల ప్రేమ.. పెళ్లి అప్పుడే చేసుకుంటాం: హీరోయిన్ నివేతా)
'జెర్సీ సినిమాలో ఓ పాత్రని(సత్యరాజ్ రోల్) నేను రిజెక్ట్ చేశాను. ఈ మూవీ ఫ్లాప్ అవుతుందేమోనని అంచనాతో ఈ నిర్ణయం తీసుకున్నాను. కానీ నా జోస్యం తప్పయింది. నా మొత్తం కెరీర్‌లో నేను పశ్చాత్తాప పడిన సందర్భం ఇదే. అప్పటినుంచి నాని సినిమా అయితే అతడు హీరోగా చేసినా, నిర్మించినా సరే ఎంత డబ్బిచ్చినా సరే అందులో నటించాలని నేను ఫిక్స్ అయ్యాను' అని జగపతిబాబు చెప్పుకొచ్చాడు. ఇదంతా కూడా నానితోనే జగపతి బాబు చెప్పడం విశేషం.
క్రికెట్ బ్యాక్ డ్రాప్ స్టోరీతో తీసిన 'జెర్సీ'.. తెలుగులోనే ఓ అద్భుతమైన సినిమాగా నిలిచింది. నాని యాక్టింగ్, మ్యూజిక్, స్టోరీ.. ఇలా ఒకటేమిటి అన్ని అంశాలు కలిసొచ్చి ఈ చిత్రం బ్లాక్ బస్టర్ సక్సెస్ అయింది. ఇందులోనే సత్యరాజ్.. నానికి కోచ్‌గా చేశారు. సత్యరాజ్ పాత్రకు కూడా మంచి గుర్తింపు వచ్చింది. మరి జగపతిబాబు ఆ రోల్ చేసుంటే ఎలా ఉండేదో?
(ఇదీ చదవండి: కన్నీళ్లు పెట్టించే మూవీ.. చేయని తప్పుకు అమ్మాయి జీవితం బలి!)