
టాలీవుడ్ స్టార్ హీరోలు ఓవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు పలు బిజినెస్‌లు కూడా చేస్తుంటారు. మహేశ్, అల్లు అర్జున్ తదితరులకు రెస్టారెంట్స్, థియేటర్లు ఉన్నాయి. వీళ్లతో పాటు రవితేజ, విజయ్ దేవరకొండ కూడా థియేటర్ వ్యాపారంలోకి వచ్చారు. ఇప్పుడు ఈ లిస్టులోకి మెగా హీరో రామ్ చరణ్ కూడా రాబోతున్నాడని సమాచారం. సోషల్ మీడియాలో ఇందుకు తగ్గట్లే కొన్ని రూమర్స్ వినిపిస్తున్నాయి.
మహేశ్ బాబుకి ఏఎమ్‌బీ, అల్లు అర్జున్‌కి ఏఏఏ, రవితేజకు ఏఆర్‌టీ, విజయ్ దేవరకొండకు ఏవీడీ పేరుతో మల్టీప్లెక్స్‌లు ఉన్నాయి. ప్రముఖ నిర్మాత, పంపిణీదారుడు ఆసియన్ సునీల్‌తో కలిసి ఈ హీరోలందరూ థియేటర్ బిజినెస్‌లో భాగస్వాములుగా ఉన్నారు. ఇప్పుడు రామ్ చరణ్ కూడా ఈ రంగంలోకి రాబోతున్నారట. త్వరలో లాంఛనంగా ఈ విషయాన్ని ప్రకటించనున్నారని తెలుస్తోంది.
(ఇదీ చదవండి: ఓటీటీల్లోకి వచ్చేసిన మూడు తెలుగు సినిమాలు)
అయితే పైన చెప్పిన హీరోలందరికీ మల్టీప్లెక్స్‌లు తెలంగాణలోనే ఉన్నాయి. కొన్నిరోజుల క్రితం అల్లు అర్జున్.. తన ఏఏఏ సినిమాస్‌ని వైజాగ్‌లోనూ లాంచ్ చేయబోతున్నారు. ప్రస్తుతం నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఇప్పుడు రామ్ చరణ్ కూడా ఆంధ్రాలోనే ఏఆర్‌సీ(ARC) సినిమాస్ పేరుతో ఓ మల్టీప్లెక్స్ ప్రారంభించబోతున్నారట. ప్రస్తుతం చర్చలో దశలో ఉందని, త్వరలో ఎక్కడ నిర్మించాలనేది ఫిక్సవుతారని టాక్ వినిపిస్తోంది. మరి బన్నీలానే చరణ్ కూడా వైజాగ్‌లోనే థియేటర్ నిర్మిస్తాడా? లేదంటే విజయవాడ, తిరుపతి లాంటి ఆప్షన్స్ చూస్తాడా అనేది తెలియాల్సి ఉంది.
రామ్ చరణ్ సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం 'పెద్ది' చేస్తున్నాడు. ఈ ఏడాది ప్రారంభంలో 'గేమ్ ఛేంజర్'తో వచ్చాడు. కానీ ఘోరమైన దెబ్బ పడింది. దీంతో 'పెద్ది' హిట్ కొట్టాలని అభిమానులు గట్టిగా కోరుకుంటున్నారు. బుచ్చిబాబు దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో జాన్వీ కపూర్ హీరోయిన్. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ స్టోరీతో తీస్తున్న ఈ చిత్రం.. వచ్చే ఏడాది మార్చి 27న థియేటర్లలోకి రానుంది.
(ఇదీ చదవండి: 'బాహుబలి 2' ఇంటర్వెల్ చూసి భయపడ్డా..: సందీప్ రెడ్డి వంగా)