
దర్శకుడు సందీప్ రెడ్డి వంగా.. ఈ పేరు చెప్పగానే అర్జున్ రెడ్డి, యానిమల్ సినిమాలు గుర్తొస్తాయి. తీసింది మూడు మూవీస్ అయినప్పటికీ పాన్ ఇండియా లెవల్లో చాలా క్రేజ్ సొంతం చేసుకున్నాడు. త్వరలో ప్రభాస్‌తో 'స్పిరిట్' చేయబోతున్నాడు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన 70 శాతం బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఇప్పటికే పూర్తయిందని చెప్పాడు. అలానే 'బాహుబలి 2' ఇంటర్వెల్ గురించి ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చాడు.
సీనియర్ నటుడు జగపతిబాబు హోస్ట్ చేస్తున్న 'జయమ్ము నిశ్చయమ్మురా' టాక్ షోకు రాంగోపాల్ వర్మతో కలిసి వచ్చిన సందీప్ రెడ్డి వంగా పలు విషయాలు మాట్లాడాడు. అలానే 'బాహుబలి 2' వల్ల తాను భయపడిన సందర్భాన్ని బయటపెట్టాడు. ఈ చిత్రం 'అర్జున్ రెడ్డి' విషయంలో ఏర్పడిన గందరగోళం గురించి చెప్పుకొచ్చాడు.
(ఇదీ చదవండి: ఘాటీ, మదరాసి, లిటిల్ హార్ట్స్.. తొలిరోజు కలెక్షన్ ఎంతొచ్చాయ్?)
'నేను ఇప్పటివరకు చూసిన సినిమాల్లో 'బాహుబలి 2' ఇంటర్వెల్ సీన్ హైలెట్ అని చెబుతాను. దాన్ని మించినది ఇప్పటివరకు రాలేదు. ఆ మూవీ చూసిన తర్వాత.. నేను అర్జున్ రెడ్డి ఇంటర్వెల్ సీన్ చూసుకున్నాను. ఇది ఆడియెన్స్‌కి నచ్చుతుందా లేదా అని ఒక్క నిమిషం భయమేసింది. అలాంటి ఇంటర్వెల్ చూసి జనాల అరుపులు గోల చూశాక.. నా ఇంటర్వెల్‌లో ఏమో హీరో తన ప్యాంటులో టాయిలెట్ పోసుకుంటాడు. అలాంటి సీన్ ఎక్కుద్దా అని భయపడ్డా. కానీ మొదటి సీన్ నుంచి మళ్లీ చూసుకున్న తర్వాత అప్పుడు నమ్మకం వచ్చింది.'
'టీజర్ వచ్చిన తర్వాత ఇంకా నమ్మకం పెరిగింది. సినిమాకు ఇంటర్వెల్ కూడా గొప్పగా ఉండాలని రాజమౌళి నిరూపించారు. అర్జున్ రెడ్డి ట్రైలర్ రిలీజ్ తర్వాత ప్రేక్షకుల నుంచి వచ్చిన రెస్పాన్స్ చూసిన తర్వాత నాకు దైర్యం వచ్చింది' అని సందీప్ రెడ్డి వంగా చెప్పుకొచ్చాడు.
(ఇదీ చదవండి: ఓటీటీల్లోకి వచ్చేసిన మూడు తెలుగు సినిమాలు)