రెమ్యునరేషన్‌ కాదు.. ఆ ఒక్క కండీషనే దీపిక కొంప ముంచింది? | Deepika Padukone Exits 'Kalki 2898AD' Sequel: The Real Reason Behind the Split | Sakshi
Sakshi News home page

రెమ్యునరేషన్‌ కాదు.. ఆ ఒక్క కండీషనే దీపిక కొంప ముంచింది?

Sep 18 2025 5:11 PM | Updated on Sep 18 2025 6:38 PM

Reason Behind The Deepika Padukone Exit From Kalki 2898 AD Sequel

ఎంత పెద్ద స్టార్‌ అయినా హిట్‌ లేకపోతే ఇండస్ట్రీలో ఎక్కువ రోజులు ఉండలేరు. అందుకే సూపర్‌ స్టార్స్‌ సైతం ఫ్లాప్‌ వస్తే కాస్త భయపడతారు. తర్వాత సినిమా విషయంలో ఆచి తూచి ఆడుగేస్తారు. అల్రేడీ హిట్‌ ఇచ్చిన డైరెక్టర్స్‌ని ఎంచుకుంటారు. లేదా హిట్‌ అయిన సినిమాకు సీక్వెల్‌ తీస్తానంటే కళ్లుమూసుకొని పచ్చ జెండా ఊపుతారు. కానీ దీపికా పదుకొణె మాత్రం ఇందుకు విరుద్ధంగా ప్రవర్తిస్తోంది. అనవసరమైన కండీషన్లతో భారీ ప్రాజెక్టులను వదులుకుంటుంది. 

మొన్నటికి మొన్న ప్రభాస్‌- సందీప్‌రెడ్డి క్రేజీ కాంబో ‘స్పిరిట్‌’ని మిస్‌ చేసుకుంది. ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ప్రభంజనం సృష్టించిన ‘కల్కి 2898 ఏడీ’ సీక్వెల్‌ నుంచి తప్పుకుంది. కాదు కాదు.. నిర్మాతలే ఆమెను తప్పించారు. ఈ విషయాన్ని అధికారికంగా తెలియజేస్తూ వైజయంతీ మూవీస్‌  ట్వీట్‌ చేసింది.  

'కల్కి 2898AD సినిమాకు రాబోయే సీక్వెల్‌లో దీపికా పదుకొణె నటించడం లేదని అధికారికంగా ప్రకటిస్తున్నాం. చాలా విషయాల్లో పరిశీలించిన తర్వాత తమ భాగస్వామ్యం నుంచి విడిపోవాలని నిర్ణయించుకున్నాం. పార్ట్‌1  సినిమా చేయడానికి చాలా దూరం ప్రయాణించినప్పటికీ, మా మధ్య  భాగస్వామ్యం కుదరలేదు. కల్కి వంటి  చిత్రానికి నిబద్ధత చాలా అవసరం. ఆమె భవిష్యత్‌లో మరెన్నో సినిమాలు చేయాలని మేము శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము' అని వైజయంతీ సంస్థ ఎక్స్‌లో పేర్కొంది. 

అసలు కారణం ఇదేనా?
దీపిక పెట్టిన కండీషన్లే తొలగింపుకు దారి తీశాయని అటు బాలీవుడ్‌తో పాటు ఇటు టాలీవుడ్‌లోనూ టాక్‌ నడుస్తోంది.  రోజుకు 8 గంటల కంటే ఎక్కువ పని చేయలేనని దీపికా పదుకొణె కరాఖండిగా చెబుతోందట. అంతేకాదు రెమ్యునరేషన్‌ విషయంలోనూ తగ్గడం లేదట. ఇబ్బందికరమైన సీన్లను చేయలేనని చెబుతోందట. కల్కి సీక్వెల్‌ విషయంలోనూ దీపిక ఇలాంటి కండీషన్లే పెట్టిందట. 

ఆ ఒక్కటే నచ్చలేదు!
అయితే పారితోషికం విషయంలో వైజయంతీ సంస్థ వెనకడుగు అయితే వేయదు.  కల్కి 2898 భారీ లాభాలను తెచ్చిపెట్టింది. అలాంది సినిమాకు సీక్వెల్‌ అంటే.. రెమ్యునరేషన్‌ విషయంలో మాత్రం నిర్మాణ సంస్థ పెద్దగా ఆలోచించదు. అడిగినంత ఇచ్చేందుకు రెడీగానే ఉందట. కానీ దీపిక పెట్టిన పని గంటల కండీషనే నచ్చలేదట.  భారీ ప్రాజెక్ట్‌ విషయంలో పని గంటల కండీషన్‌  పని చేయదు. అందుకే నిర్మాతలు ‘పూర్తి నిబద్ధత’ అవసరం అని ప్రకటించారు. 

పెద్ద సినిమాల షూటింగ్‌ చెప్పిన సమయానికి పూర్తికాదు. నెలల తరబడి షూటింగ్‌ చేయాల్సి వస్తుంది. దీపిక పదుకొణె లాంటి స్టార్స్‌కి ఈ విషయం తెలుసు. అయినా కూడా తలకు మించిన కండీషన్లు పెట్టి.. సినిమాలను దూరం చేసుకుంటున్నారు.  ఇలాంటి కండీషన్లు నచ్చకనే సందీప్‌రెడ్డి వంగా ‘స్పిరిట్‌’ నుంచి తప్పించాడు. ఇప్పుడు మరో భారీ ప్రాజెక్ట్‌ కూడా చేజారిపోయింది. దీపికా వైఖరి మారకపోతే.. మున్ముందు సినిమా చాన్స్‌లు రావడమే కష్టమవుతుందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement